Site icon NTV Telugu

CM Chandrababu: తెలుగు జాతికి తిరుగే లేదు.. ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుంది!

Telugu Diaspora Chandrababu

Telugu Diaspora Chandrababu

దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్‌లోని తెలుగు ప్రజలతో డయాస్పోరా కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గల్ఫ్‌లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దుబాయ్‌కిలోని లీ మెరిడియన్ హోటల్‌లో అత్యంత ఉత్సాహభరితంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతికి తిరుగే లేదని, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా తయారవుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించానని సీఎం తెలిపారు.

’30 ఏళ్ల ముందు ఐటీని ప్రోత్సహించాను. తెలుగు వాళ్లు ఐటీ నిపుణులుగా ఇప్పుడు ప్రపంచం అంతా రాణిస్తున్నారు. సత్యనాదెళ్ల లాంటి తెలుగు వాళ్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి కోసం ప్రవాసాంధ్రులంతా తపించి గెలిపించారు. గల్ఫ్ దేశాల నుంచి మీరు తరలివచ్చి తెలుగు డయాస్పోరాకు హాజరు కావటం ఆనందాన్ని కలిగిస్తోంది. అబుదాబీ, దుబాయ్ ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జి ఎకానమీ దిశగా నడుస్తున్నాయి. 1.50 లక్షల హోటల్ రూములతో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది’ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: AP News: ఏపీ ఎస్పీడీసీఎల్‌లో వేలకోట్ల అవినీతి.. రిటైర్డ్ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు!

గతంలో హైదరాబాద్ నగరంకు మైక్రోసాఫ్ట్ తీసుకువస్తే ఇప్పుడు ఏపీలోని విశాఖకు గూగుల్ తీసుకువస్తున్నాం. దేశంలో క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ప్రతీ ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి లక్ష్యాన్ని సాధిస్తాం. ఐటీ, కమ్యూనికేషన్ల రంగంలో విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్నాం. సాంకేతికత ద్వారా పాలన అందించేలా వాట్సప్ ద్వారా 730కి పైగా పౌర సేవలు అందిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Exit mobile version