Site icon NTV Telugu

CM Chandrababu: ఐటీ గురించి కాదు.. రైతుల కోసమే ఎక్కువగా ఆలోచిస్తా!

Cm Chandrababu

Cm Chandrababu

ప్రతి ఎమ్మెల్యే నెలకు ఒక రోజు రైతుల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసు కోవాలన్నారు సీఎం చంద్రబాబు. వచ్చే నెల నుంచి రైతులకు సంబంధించి తక్షణ కార్యాచరణ ప్రారంభిస్తాం అని ప్రకటించారు. తాను ఐటీపై మాట్లాడితే ఐటీ వ్యక్తి అనుకుంటారని, కానీ రైతుల కోసమే ఎక్కువ ఆలోచిస్తా అన్నారు సీఎం. వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం అని, రైతుల నికర ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం అని సీఎం చెప్పారు.

‘రైతులు యూరియాను మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. ఎరువుల వినియోగం తగ్గిస్తే పీఎం ప్రణామ్‌ కింద నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది. పీఎం ప్రణామ్‌ కింద కేంద్రం ఇచ్చిన నిధులను రైతులకు చెల్లిస్తాం. చరిత్రలో తొలిసారి హెక్టారు ఉల్లికి రూ.50 వేలు ఇస్తున్నాం. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే సేంద్రీయ వ్యవసాయం చేయాలి. రైతులు బాగుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. వ్యవసాయం లాభసాటిగా మారేంత వరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లలో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేలా చేస్తాం. పొలం బడి, పొలం పిలుస్తోంది రా అనే వివిధ కార్యక్రమాల ద్వారా గతంలో రైతులతో మాట్లాడాం. ప్రతీ శాసనసభ్యుడూ నెలకు ఒక్క రోజు పొలం దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడాలి’ అని సీఎం చెప్పారు.

Also Read: Cholera-Tenali: తెనాలిలో కలరా కలకలం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు..!

‘అక్టోబరు నుంచి ప్రతీ నెలా రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు విని పరిష్కారం చేస్తాం. రాష్ట్రంలో 35 శాతం మేర జీఎస్డీపీ వ్యవసాయం నుంచే వస్తోంది. రైతులు, ప్రజా ప్రతినిధులు అందరం కలిసి వ్యవసాయాన్ని లాభసాటి చేద్దాం. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే. ఐటీ గురించి మాట్లాడితే.. ఐటీ వ్యక్తి అనుకుంటారు కానీ నేను చేసిన పనులన్నీ రైతులకు ఉపకరించేవే. నీరు, చెట్టు, రిజర్వాయర్లు, చెక్ డ్యామ్లు, కాలువలు ఇలా ప్రతీ అంశాన్నీ వ్యవసాయ రంగానికి అనుకూలమైన ఆలోచనలే చేశా. సాగునీరు, వ్యవసాయ రంగం అభివృద్ధికే నిర్ణయాలు తీసుకున్నాను. అక్టోబరు నుంచి క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Exit mobile version