Cyclone Arnab Impact: తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. రాత్రంతా అధికారులకు దిశానిర్దేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Reviews Cyclone Arnab Impact: అర్నబ్ తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులు, క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులతో సీఎం సమీక్ష చేశారు. రాత్రంతా అర్నబ్ తుఫాన్ ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. క్షేత్ర స్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 1:30 గంటల వరకు సీఎం పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూనే అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇవాళ ఉదయం 6:15 గంటలకు మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి, జరుగుతున్న తుఫాన్ సహయక చర్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. తుఫాన్ తీరం దాటుతోందని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు ఆర్టీజీఎస్ అధికారులు. తుఫాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయని, కొన్ని చోట్ల విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయని సీఎం దృష్టికి తీసుకెళ్ళారు అధికారులు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు చెప్పారు.
Also Read
- 10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
అతి తీవ్ర తుఫాన్ ‘అర్నబ్’ కోస్తాంధ్రను వణికించింది. మంగళవారం వీచిన ప్రచండ గాలులకు చాలా చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల హోర్డింగులపై ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. అత్యంత భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో అతి భారీవర్షం కురిసింది. తుఫాన్ పరిస్థితిపై సీఎం చంద్రబాబు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Cyclone Arnab Impact: తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. రాత్రంతా అధికారులకు దిశానిర్దేశం!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
PM Modi’s Big Call to India: భవిష్యత్ టెక్నాలజీలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలి.. ప్రధాని మోడీ
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!