NTV Telugu Site icon

CM Chandrababu: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

CM Chandrababu: పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలకు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని రూ. 10- 25 వేలకు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం నిర్వహణకు ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్టు సీఎంకు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది.

Read Also: AP Government: స్థానిక సంస్థలకు గుడ్‌న్యూస్.. రూ.1452 కోట్ల నిధుల విడుదల చేసిన సర్కార్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత వేటు నిబంధనను తొలగించినట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై కేబినెట్‌లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపైనా సమీక్షలో చర్చించారు. దీనిపై పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నెల 23 తేదీన 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు.

Show comments