NTV Telugu Site icon

CM Chandrababu: పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేసిన సీఎం..

Polavaram

Polavaram

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పీడ్‌ పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వరుసగా సమీక్షలు, సమావేశాలు.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.. ఇక, ఆంధ్రా ప్రజల జీవనాడి అయిన పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదిదమే.. కాగా, దీనికి ఏపీ కేబినెట్‌ ఆమోదం కూడా తెలిపింది.. అందులో భాగంగా.. పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల చేశారు.. గత ఐదేళ్ల కాలంలో పోలవరంలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు.

Read Also: CM Revanth Reddy: సంస్కర‌ణ‌ల‌తో దేశ ప్రగ‌తిని పీవీ పరుగులు పెట్టించారు..

వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.. 20-25 రోజుల్లో శ్వేత పత్రాలు విడుదలను పూర్తి చేస్తాం. ఆ తర్వాత బడ్జెట్‌ పెడతాం అన్నారు.. ఇరిగేషన్‌.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు ప్రత్యేక వెబ్‌సైటులో పెడతాం. చెప్పిన తప్పులను వందసార్లు చెప్పి.. ప్రజలను నమ్మించేందురు గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు.. పోలవరం, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నామన్న ఆయన.. నదుల అనుసంధానానికి పోలవరం ఓ వరంగా పేర్కొన్నారు.. ఇలాంటి పోలవరానికి జగన్ ఓ శాపంగా మారాడు అని దుయ్యబట్టారు.. అన్నింటికీ అతీతంగా అందరూ జగన్ చేసిన తప్పులను నిలదీయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో రెండు సీజన్ల పాటు పోలవరం పనులను నిలిపేశారు. సమర్ధులైన అధికారులను బదిలీ చేసేశారు. డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని.. రెండేళ్ల తర్వాత గుర్తించారు. పీపీఏ వద్దని చెప్పినా.. కాంట్రాక్టరును మార్చారు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు..