ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ అనుభవంతో ప్రజలకు సంపదను సృష్టిస్తా అని చెప్పా.. అభివృద్ధి వల్ల సంపద వస్తుందని సీఎ చంద్రబాబు అన్నారు. సంపద వల్ల సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. 1991లో ఆర్ధిక సంస్కరణలు వచ్చాయి.. 1993లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చానన్నారు. రాష్ట్రానికి వెలుగులు ఇచ్చి తాను అధికారం కోల్పోయానని పేర్కొన్నారు.
Read Also: Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
హైదరాబాద్‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసాం.. రహదారుల విస్తరణ 14 లైన్ల వరకు వెళ్ళిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమాల వల్ల ఆదాయం బాగా పెరిగిందని తెలిపారు. ఐటీ తిండి పెడుతుందా అని చాలా మంది ఎగతాళి చేసారు.. ఐటీ ఇప్పుడు ఎక్కడికో తీసుకు వెళ్ళిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇండియాలో ఆధార్ వ్యవస్థ బాగా బలంగా ఉంది.. ఆయుష్మాన్ భారత్, రైతు భరోసా అన్నిటికీ ఆధార్ ఉండాలన్నారు. ప్రతి ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు.. సంపద సృష్టికి P4 విధానం తెస్తున్నామని సీఎం తెలిపారు. P4 అనేది గేమ్ ఛేంజర్ గా మారుతుందని చెప్పారు.
Read Also: Saif Ali Khan: సైఫ్ వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొన తొలగింపు!
తాము తయారు చేసిన విజన్ డాక్యుమెంట్‌కు 16 లక్షల మంది ఆన్‌లైన్‌లో తమ అభిప్రాయాలు చెప్పారని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ఏపీకి లైఫ్ లైన్ అని అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం.. వెల్తీ, హెల్తీ ఫ్యామిలీనే తన గోల్ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు నిరంతరం పని చేస్తాను.. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది.. అమెరికాలో ఉండే తెలుగు వారి ఆదాయం బాగా పెరుగుతోందని పేర్కొన్నారు. అన్నిటికంటే అభివృద్ధి అనేది కీలకం.. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి.. వ్యక్తిగత ఆదాయం పెరగాలి.. ఆరోగ్యం బావుండాలి.. ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.