Vizag: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తులంతా విశాఖపట్నంలోనే పర్యటిస్తున్నారు.. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖలో ఉన్నారు.. రెండో రోజు సేనతో సేనాని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ముఖ్య కార్యకర్తలతో ఇవాళ ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.. ఇక, మధ్యాహ్నం పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశంకానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Sridevi Drama Company Hyper Aadi: హైపర్ ఆది పంచ్‌పై వివాదం..
మరోవైపు, నేడు విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులు షికారు చేయనున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా వీటిని ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నగర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తొలిసారి రెండు ‘హోప్ ఆన్.. హోప్ ఆఫ్’ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్ కే బీచ్ లోని కాళీమాత ఆలయం సమీపంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జీవీఎంసీ చేసింది. ప్రతీ రోజు ఆర్కే బీచ్ నుంచి కైలాసగిరి, రుషికొండ, తొట్ల కొండ పర్యాటక ప్రదేశాలకు ఈ బస్సులు తిరుగుతాయి. విశాఖ సాగర తీర అందాలను డబుల్ డెక్కర్ బస్సుల్లో ఆస్వాదించడం ఖచ్చితంగా మంచి అనుభూతి మిగులుస్తుందని పర్యాటక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Tollywood : కంటెంట్ ఆలస్యం.. మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయిన సూపర్ హిట్ సినిమా
ఇవాళ విశాఖలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. నోవాటెల్ లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ లో పాల్గొంటారు.. రాడిషన్ బ్లూ హోటల్ లో గ్రీఫిన్ ఫౌండర్ నెటవర్క్స్ మీటింగ్ కు హాజరుకానున్నారు.. ఇక, సాయంత్రం విశాఖ నుండి కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు… రేపు కుప్పంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పైన పైలాన్ ను ఆవిష్కరించబోతున్నారు.. అనంతరం హంద్రీనీవా సుజల స్రవంతి జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు.. అనంతరం వివిధ సంస్థలతో mouల కార్యక్రమంలో పాల్గొంటారు.. అనంతరం పారిశ్రామికవేత్తలతో, ప్రతినిధులతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు….
Read Also: Telangana Flood Rescue : తెలంగాణలో ఇవాళ 1,444 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు
ఇక, విశాఖలో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. వైజాగ్ కన్వెన్షన్ లో జరిగే అర్థసమృద్ధి 2025- ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్ కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ లో ఏఐ ల్యాబ్స్ ప్రారంభించనున్న ఆయన.. ఎయిరోస్పేస్ మానుఫ్యాక్చరింగ్ పై సీఐఐ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు హాజరుకానున్నారు.. ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్ లో జరిగే స్పోర్ట్స్ మీట్ లో పాల్గొననున్నారు లోకేష్.. సాయంత్రం భారత మహిళా క్రికెట్ జట్టుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు మంత్రి నారా లోకేష్..
