Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Orders Collectors To Resolve Public Grievances Quickly In Andhra Pradesh

CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!

Published Date :May 8, 2026 , 1:26 pm
By Sampath Kumar
  • కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్‌
  • ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం కీలక ఆదేశాలు
  • గ్రీవెన్స్‌ డే వ్యవస్థపై సీఎం సమీక్ష
CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరిగతిన పరిష్కరించేలా కొత్త విధానాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. గ్రీవెన్స్‌ డే వ్యవస్థపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఇకపై ప్రతి నియోజకవర్గంలో కూడా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లే.. ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ఫీల్డ్ గ్రీవెన్స్‌ డే నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు.

పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్) విధానంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పని చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజాదర్బార్ తరహాలో పీజీఆర్ఎస్ కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. సింగపూర్‌లో కూడా ఇదే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం జరుగుతోందని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో కూడా పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా ప్రజలకు మరింత ఉపయోగం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావడమే కాకుండా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అన్నారు.

Also Read

  • Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
  • CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Add as a preferred
source on google

ఈ సందర్భంగా కలెక్టర్ల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అర్జీలు తీసుకుని కార్లో పెట్టుకోవద్దు. సమస్యలకు నిజంగా పరిష్కారం చూపాలి’ అంటూ అధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఫిర్యాదులను కేవలం స్వీకరించడం కాదు.. వాటిని వేగంగా పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి నెలలో కనీసం నాలుగు సార్లు ఒక నియోజకవర్గాన్ని సందర్శించాలని కలెక్టర్లకు ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం గుడ్‌విల్ మిషన్‌లా క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు. అలాగే అధికారులపై వీడియో కాన్ఫరెన్సుల భారం తగ్గించే దిశగా కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అన్ని వీడియో కాన్ఫరెన్సులను వారానికి ఒక రోజుకే పరిమితం చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎక్కువ సమయం కేటాయించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • AP grievance system
  • cm chandrababu
  • Collectors Meeting
  • Field Grievance Day

తాజావార్తలు

  • CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!

  • SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!

  • RCB IPL 2026 Playoffs: ఆర్‌సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!

  • DRDO TARA Test: డీఆర్‌డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే

  • Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions