CM Chandrababu : మద్యం దుకాణదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణదారులకు శుభవార్త అందించింది
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్‌ను పెంచే నిర్ణయం తీసుకున్నారు
- ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తున్నారు
- 14 శాతం మార్జిన్ ఇవ్వాలని నిర్ణయించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణదారులకు శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్‌ను పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తున్నారు, కానీ ఈ మార్జిన్ అప్రతిపాదితంగా ఉన్నది అని, దుకాణ యజమానులు పెంచాలని కోరిన నేపథ్యంలో, ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను పరిశీలించి, తెలంగాణలో ఇచ్చిన విధంగా ఇక్కడ కూడా 14 శాతం మార్జిన్ ఇవ్వాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంగా ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ముఖ్యంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపుల్లో గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయానికి సంబంధించి, వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Also Read
- Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులలో 340 షాపులు గీత కులాలకు కేటాయిస్తారు. గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీసాయన, శెగిడి, గౌండ్ల, యాత, సోదీ వంటి కులాలకు ఈ షాపులు కేటాయిస్తారు. షాపుల కేటాయింపు ఆయా కులాల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడుతుంది. ప్రతి వ్యక్తి ఒక్కొక్క షాపు కోసం ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ ఒక వ్యక్తికి ఒక్కటే షాపు కేటాయిస్తారు. ఈ షాపులు 2026 సెప్టెంబర్ 30 వరకు నడుస్తాయని ప్రకటించారు.
మరోవైపు, రూ. 99కి మద్యం అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై కూడా చర్చ జరిగింది. మద్యం అమ్మకాలు ప్రతీ సంవత్సరం పెరుగుతున్నా, తక్కువ రేట్లలో మద్యం విక్రయించడం వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం లభించడం లేదని అధికారులు తెలిపారు. అయినా, మద్యం అన్ని చోట్లా తక్కువ రేట్లలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని, మద్యం తయారీ, సరఫరా, సేల్స్‌ను టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించి, నిబంధనల ఉల్లంఘన నివారించాలన్నారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర , ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!