CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా గృహాల గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.. అలాగే సోషల్ మీడియా ప్రతిభావంతులతో కూడా ముచ్చటించనున్నారు. సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు చంద్రబాబు.. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని చిన్నమండెం ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా పూర్తి చేసింది.
Read Also: Mohammed Siraj: మంచి ఫామ్‌లోనే ఉన్నా.. సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..
* ఉదయం 9:10 గంటలకు — ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో చిన్నమండెం బయలుదేరి వెళ్తారు.
* ఉదయం 10:40 గంటలకు — చిన్నమండెంలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు.
* ఉదయం 10:50 గంటలకు — రాజీవ్ కాలనీకి చేరుకుంటారు.
* ఉదయం 10:55 నుంచి 11:45 వరకు — పేదల కోసం నిర్మించిన ఇళ్లను ప్రారంభించి, గృహప్రవేశం, పూజా కార్యక్రమాల్లో పాల్గొని, లబ్ధిదారులు హేమలత, ముంతాజ్ బేగం లను పరామర్శిస్తారు.
* ఉదయం 11:50 గంటలకు — దేవగుడిపల్లి గ్రామంలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు.
* మధ్యాహ్నం 1:30 నుంచి 1:40 వరకు — సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో సమావేశం.
* మధ్యాహ్నం 2:30 గంటలకు — టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భేటీ.
* సాయంత్రం 4:05 గంటలకు — చిన్నమండెం హెలిపాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి కడప ఎయిర్‌పోర్టు వెళ్తారు. అక్కడి నుంచి విమానంలో విశాఖపట్నం బయలుదేరుతారు.
