రాజకీయాలు పూర్తి కలుషితం అయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నేడు తిరుపతి పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరస్థులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు కీడు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు ఉన్న ఈ నేరస్థులను లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 2019లో ఎన్నికల ముందు మోసపోయానని.. ఎప్పుడూ నేను నేరం చేశానా.. హత్య రాజకీయాలు చేశానా..? అని ప్రశ్నించారు. ఎస్వీ వర్శిటీలో చదువుకున్నప్పటి నుంచి ఎప్పుడూ నేరం జోలికి పోలేదన్నారు. ప్రజలు ఆస్తుల రక్షణ తన తోలి ప్రాధాన్యతని… లా అండ్ ఆర్డర్‌కు తొలి బాధ్యత చేస్తానన్నారు. హింసా రాజకీయాలు ప్రోత్సహించనని స్పష్టం చేశారు. అలా హింసా రాజకీయాలు చేసే వారి గుండెల్లో నిద్రపోతానన్నారు.
READ MORE: Operation Sindoor: పాకిస్తాన్ “కిరాణా హిల్స్”పై భారత్ దాడి చేసింది..
“వివేకానంద రెడ్డి గుండె పోటుతో చనిపోయారని డ్రామాలు ఆడారు… వివేకానందను అత్యంత దారుణం చంపారు.. వివేక కూతురు సునీత వల్ల అసలు నిజం బయటకు వచ్చింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించండి. గత ప్రభుత్వం చెత్త మీదా పన్నులు వేశారు.. అక్టోబర్ నాటికి యార్డుల్లో ఉండే చెత్త లేకుండా చేస్తాం.. అక్టోబర్ రెండు నాటికి చెత్త సేకరణ కోత్త వాహనాలు వస్తాయి. ప్లాస్టిక్ భూతంను తరిమి కొట్టండి.. మీలా నేను కూడా ఇక్కడే చదువుకొని, అటు తరువాత ఎమ్మెల్యే అయి నాలుగో సారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాను. జపాన్ లో రోడ్లు శుభ్రం చేసే మనుషులు ఉండరు. ప్రజలే శుభ్రత పాటిస్తారు. ఈ ప్రపంచంలో ఏదీ వ్యర్థం కాదు. వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ విక్రయిస్తారు. చిన్నప్పుడు లాంతర్ల వెలుగులో చదువుకున్నాను. క్వాంటం వ్యాలీ లాగా హైడ్రోజన్ వ్యాలీని కూడా త్వరలో తీసుకువస్తాం. మామిడి రైతులకు ఇబ్బందులు ఉన్నాయి.. తమిళనాడు, కర్ణాటక అక్కడి రైతులను పట్టించుకోలేదు. ఇక్కడి రైతులకు టన్నుకు 12వేలు ఇచ్చాను. మామిడి రైతులను నేను ఆదుకుంటే వైసీపీ వాళ్ళు రైతుల మామిడి పండ్లను రోడ్ల మీదా పోసి తోక్కించారు. అలాంటి రౌడీలు మనకు అవసరమా. ఐదేళ్ళుగా స్వేఛ్చ అనేది ప్రజలు ఉందా? భయంతో గడిపారు. ఇప్పుడు కూటమి వచ్చాక స్వచ్ఛ లభించిందని ప్రజలు సంతోషంగా ఉన్నారు. సూపర్ సిక్స్ అమలు చేశాం… పెన్షన్ నాలుగు వేలు ఇచ్చాం.. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం.. దీపం ద్వారా సిలెండర్ ఇచ్చాం.. మానవత్వం ఉన్న పార్టీ ఎన్డీఏ కూటమి.” అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
READ MORE: Wife Kills Husband: బావతో వివాహేతర సంబంధం, భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి హత్య..
