రాజకీయాలు పూర్తి కలుషితం అయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నేడు తిరుపతి పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం మీడియాతో మాట్లాడారు. నేరస్థులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు కీడు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు ఉన్న ఈ నేరస్థులను లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 2019లో ఎన్నికల ముందు మోసపోయానని.. ఎప్పుడూ నేను నేరం చేశానా.. హత్య రాజకీయాలు చేశానా..? అని ప్రశ్నించారు.