క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని నోవాటెల్ లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీపై వర్క్ షాప్ ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. వివిధ బహుళ జాతి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఐటీ, ఫార్మా, వాణిజ్య రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలోనే తొలిసారిగా IBM, TCS, L&T సహకారంతో అమరావతి లో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేశారు.
Also Read:AP BJP Chief : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్న పీవీఎన్ మాధవ్..
జనవరి నుంచి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు జరుగనున్నాయి. అమరావతిలో టెక్ వ్యాలీ పార్కులోనే లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.. ఇతర రాష్ట్రాలూ సేవలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలి ఏర్పాటు కానున్నది. రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.