Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Meets Union Minister Piyush Goyal

CM Chandrababu: సీఎంతో ముగిసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ భేటీ.. ఈ అంశాలపై చర్చ

Published Date :June 15, 2025 , 5:37 pm
By RAMAKRISHNA KENCHE
  • పొగాకు రైతుల సమస్యలు, పలు అంశాలపై చర్చ
  • గుంటూరు పొగాకు బోర్డ్ ఆఫీస్‌లో సమావేశం
  • పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై చర్చ
  • పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించిన చంద్రబాబు
CM Chandrababu: సీఎంతో ముగిసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ భేటీ.. ఈ అంశాలపై చర్చ
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చ జరిగింది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించింది. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు వివరించారు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ. 300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలన్న ముఖ్యమంత్రి విన్నవించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్టసవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరారు.

READ MORE: Jagtial: వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా.. 9 మందికి విద్యుత్ షాక్.. ఇద్దరి పరిస్థితి విషమం..

ఆయిల్ ఫాం దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలని పీయూష్ గోయల్ ను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని.. తీవ్రంగా నష్టపోతారని కేంద్ర మంత్రికి వివరించారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం.. కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సూచించారు. సీఫుడ్ పై అమెరికా విధించిన 27 శాతం సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని సీఎం వెల్లడించారు. ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలన్నారు. మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని కోరారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు పీయూష్ గోయల్ కు సీఎం తెలియజేశారు.

READ MORE: Oil Discovery: జాక్‌పాట్ కొట్టిన భారత్.. అండమాన్ సముద్రంలో భారీగా ఆయిల్ నిల్వలు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh farmers
  • ap agriculture
  • AP CM Delhi Visit.
  • Aqua exports
  • aqua farmers

తాజావార్తలు

  • CM Chandrababu: అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌.. ఇది చారిత్రాత్మకం.. మోడీ, అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • Yuvraj Singh: ధోని, కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. కారణం ఇదే..

  • Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్‌పై ట్రంప్ సెటైర్లు..

  • Ambati Rambabu: పిన్నెల్లిని పరామర్శించిన అంబటి.. పోలీసులు, సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

  • MG Starlight 560: భారత్ లో విడుదల కానున్న ఎంజీ స్టార్‌లైట్ 560.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions