Site icon NTV Telugu

TDP Mahanadu 2025: మరలా పెద్ద నోట్లు రద్దు చేయాలి.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

Chandrababu Demonetisation

Chandrababu Demonetisation

భారతదేశంలో మరలా పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతి తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను కూడా రద్దు చేసి.. ఆర్ధిక లావాదేవీలను డిజిటల్‌లో మార్చిచే అవినీతిని రూపుమాప వచ్చన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సప్ గవర్నర్స్ తీసుకొచ్చాం అని, ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం అని స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో భద్రత కల్పిస్తాం అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు 2025లో సీఎం ప్రసంగించారు.

‘అన్నదాతకు రూ.20,000 ఇస్తున్నాం. మూడు విడతలుగా రైతుల అకౌంట్లో నగదు జమ చేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు శుభవార్త చెబుతూ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో భద్రత కల్పిస్తాం. ప్రభుత్వ పనితీరు పైన కూడా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడతాం. పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సప్ గవర్నర్స్ తీసుకొచ్చాం, ఇది ఒక గేమ్ చేంజర్. దేశంలో పెద్ద నోట్లు రద్దు చేయండని, డిజిటల్ కరెన్సీ తేవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరా. అన్ని పెద్ద పెద్ద నోట్లు రద్దు చేయాలి, అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి నశిస్తుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: Nara Lokesh: పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం.. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలు!

‘అమరావతి పూర్తి చేస్తాం. రాయలసీమ సమగ్ర అభివృద్ధి నా బాధ్యత. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఫ్యాక్షన్‌ను అంతం చేశాం. పోయిన ఐదు సంవత్సరాలలో ఇరిగేషన్ కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. హంద్రీనీవా కాలవ పనులు ఏడదిలో పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. కడపలో కొప్పర్తి, కర్నూలులో ఓర్వకల్‌ను పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తా. వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతా. దేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా నిలిపేందుకు నిరంతరం పనిచేస్తాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.

Exit mobile version