Site icon NTV Telugu

CM Chandrababu: పొదిలిలో వైసీపీ రాళ్ల దాడిపై సీఎం సీరియస్‌.. డీజీపీకి కీలక ఆదేశాలు..

Cbn

Cbn

CM Chandrababu: పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సీరియస్‌ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ అరాచకాలు ఏంటి? మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా? అని మండిపడ్డ ఆయన.. దాడులకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోండి అంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు..

Read Also: Phone Tapping Case: తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.. సిట్ విచారణలో ప్రభాకర్‌రావు సమాధానాలు!

రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి ఈ అరాచకాలు ఏంటి? అని నిలదీశారు.. మహిళలపై, పోలీసులపై రాళ్లు వేస్తారా? దాడులకు పాల్పడిన వాళ్లపై ఆధారాలు సేకరించి… చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పొగాకు రైతులకు గిట్టుబాట ధర విషయంలో పరామర్శ పేరుతో వైఎస్‌ జగన్ చేసిన రాజకీయ యాత్రలో వైసీపీ శ్రేణులు దాడులకు దిగడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ‘రైతుల పరామర్శకు వెళ్తే జిల్లా వ్యాప్తంగా జనసమీకరణ ఎందుకు? వెళ్లింది రైతుల కోసమా.. దాడుల కోసమా? అని ప్రశ్నించారు. నా ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలకు తావులేదు.. ప్రజా సమస్యల పేరుతో జనంలోకి వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారని విమర్శించారు.

Read Also: Thammudu: ప్రేమతో చెప్తే అర్థం కాదు.. నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ రివ్యూ

ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తుంటే… దాన్ని అలసత్వంగా భావిస్తున్నారా? దుర్వినియోగం చేస్తారా? అని ఫైర్‌ అయ్యారు సీఎం.. జగన్ పర్యటనలు చూస్తుంటే… తన ఉద్దేశం రైతుల సమస్యలు కాదు… అలజడి సృష్టించి ఉనికి చాటుకునే ప్రయత్నమే అని అర్ధం అవుతుందన్న ఆయన.. రాజకీయ అజెండాతో చేసే ఇలాంటి పోకడలను అంగీకరించేది లేదన్నారు.. సమస్య ఉంటే నిరసనలు తెలపడానికి, పరామర్శకు వెళ్లడానికి అభ్యంతరం లేదు. ప్రభుత్వం ఎక్కడా అనుమతులు నిరాకరించడం లేదు. అయితే ప్రతి పర్యటనలో వాళ్లు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

Exit mobile version