CM Chandrababu: చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. అనంతరం ఉండవల్లి వెళ్తూ మధ్యలో ఆగారు. ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి.. బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లను తిలకించారు. బ్యారేజీ వద్ద సందర్శకులను పిలిచి మాట్లాడగా.. వారు సీఎం చంద్రబాబుతో సెల్ఫీలు దిగారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. కృష్ణమ్మకు కలకళ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇరిగేషన్ అధికారులతో వరద పరిస్ధితిని ఆరా తీశారు. కాలువలకు నీటి విడుదల సక్రమంగా జరగాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
Read Also: Illegal Constructions: లేవుట్ భూముల్లోని తాత్కాలిక నిర్మాణాలను తొలగించిన హైడ్రా సిబ్బంది..
ప్రకాశం బ్యారేజీ వద్ద 1,37,450 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలో విడుదల చేస్తున్నారు. కాలువలకు 13,477 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,50,927 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులుగా ఉంది. 50 గేట్లను 3 అడుగులు, 20 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.