NTV Telugu Site icon

CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Babu 2

Babu 2

CM Chandrababu: తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను మోయలేనంత భారం నామీదా ఉందన్న ఆయన.. మొత్తం ఖజానా ఖాళీ చేశారు.. ఎక్కడెక్కడ అప్పులు చేశారో ఎవరికి అంతుపట్టడం లేదు.. మీరు అనుకున్నంత ఆశాజనకంగా అక్కడ పరిస్థితి లేదన్నారు.. నేను, పవన్‌ కల్యాణ్‌ సంకల్పం తీసుకున్నాం… అభివృద్ధి లక్ష్యంగా రేయింబవళ్లు పనిచేస్తాం అన్నారు. ఇక, రాష్ట్ర పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు చంద్రబాబు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, అమరావతి, మద్యం పాలసీ, భూగర్బ ఖనిజ సంపదైన ఇసుక, గ్రానైట్‌.. సహా ఇతర వాటిపై శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు..

Read Also: Uttar Pradesh: పేపర్ లీకులకు చేశారో అంతే సంగతి.. జీవిత ఖైదు, రూ. 1 కోటి జరిమానా..

కుప్పం ద్రావిడ వర్శిటీని ప్రక్షాళన చేస్తాను అని ప్రకటించారు సీఎం చంద్రబాబు.. రామకుప్పంలో వైసీపీ దొంగలు గంజాయి సాగు చేస్తున్నారు అని ఆరోపించిన ఆయన.. గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తాను అన్నారు. కుప్పంలో హింస, అవినీతి, దౌర్జన్యాలు ఇకమీదట జరగకూడదు అని స్పష్టం చేశారు. చాలాచోట్ల 90 వేలకుపైగా మెజారిటీ వచ్చింది.. 57 శాతం వన్ సైడ్ ఓట్లు చేశారని తెలిపారు. నలభై ఏళ్లుగా ఎప్పుడూ రాని నా సతీమణి భువనేశ్వరి.. తొలిసారి కుప్పంలో ప్రచారానికి వచ్చారని గుర్తుచేశారు. ఇక, ఒకటో తేదీన నూతన పెన్షన్ విధానం అమలు చేస్తున్నాం.. సచివాలయ సిబ్బందితో నేరుగా ఇంటి దగ్గరికే రూ.7 వేల పెన్షన్ ను అందిస్తాం అన్నారు.. డబ్బు కాదు ముఖ్యం మానవత్వం ముఖ్య అన్నారు.. ఇక, ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 185 అన్నా క్యాంటిన్లను ప్రారంభిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక, సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు.. కుప్పం సభలో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..