Uttar Pradesh: పేపర్ లీకులకు చేశారో అంతే సంగతి.. జీవిత ఖైదు, రూ. 1 కోటి జరిమానా..
- పేపర్ లీక్‌పై యూపీ సర్కార్ కఠిన చట్టం..
- జీవిత ఖైదు- రూ. 1 కోటి జరిమానా..
- సీఎం యోగి సంచలన నిర్ణయం..
- ఆర్డినెన్స్ జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paper leak cases: నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీక్ కేసులు దేశవ్యాప్తంగా సంచలన రేపాయి. మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రతిపక్షాలు, పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. ఈ ఆందోళనల నడుమ పరీక్ష బాధ్యతలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్మాణం, పనితీరు, పాదర్శకతను మెరుగుపరిచేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది.
Read Also: Triple Talaq: బీజేపీకి సపోర్ట్ చేసినందుకు భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఇదిలా ఉంటే, పేపర్ లీకులను అరికట్టేందుకు సీఎం యోగి నేతృత్వంలో ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు లీకులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కఠిన చట్టాన్ని తీసుకురాబోతోంది. ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు జీవిత ఖైదుతో పాటు రూ. 1కోటి వరకు జరిమానా విధించాలనే కఠిన చట్టాన్ని తీసుకువస్తోంది. ముఖ్యమంత్రి యోగి అధ్యక్షతన జరిగిన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) ఆర్డినెన్స్ 2024కి యూపీ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం యూపీ అసెంబ్లీ సమావేశాలు లేనందుకున ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఆర్డినెన్స్‌లోని నిబంధనలు డిగ్రీ, డిప్లొమా మరియు ఇతర కోర్సులకు ప్రవేశ పరీక్షలతో పాటు పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు, రెగ్యులరైజేషన్ లేదా ప్రమోషన్ పరీక్షలకు వర్తిస్తాయని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. నకిలీ పరీక్షా పత్రాల పంపిణీ మరియు నకిలీ ఉద్యోగ వెబ్‌సైట్‌లను తయారు చేయడం కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించబడింది. ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలిన వారికి రెండేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. పరీక్షలు నిర్వహంచే కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి పరీక్ష రద్దు వల్ల అయ్యే ఖర్చును తీసుకునేందుకు, వాటిని బ్లాక్ లిస్టు చేయడానికి కూడా ఆర్డినెన్స్ నిబంధనలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!