Site icon NTV Telugu

CM Chandrababu: దుబాయ్‌లో చంద్రబాబు రోడ్ షో.. రాష్ట్రాన్ని ఆవిష్కరించిన సీఎం..

Cm Chandrababu Singapore

Cm Chandrababu Singapore

CM Chandrababu: దుబాయ్ వేదికగా పెట్టుబడుల సాధనలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషనుకు యూఏఈ పారిశ్రామికవేత్తలు రెస్పాండ్ అయ్యారు. సీఎం ప్రజెంటేషనుకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు పారిశ్రామికవేత్తలు.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. వ్యవసాయం మొదలుకుని టెక్నాలజీ వరకు.. గనులు మొదలుకుని స్పేస్ టెక్నాలజీ వరకు.. చిప్ మొదలుకుని షిప్ బిల్డింగ్ వరకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. పెట్టుబడుల గురించే కాకుండా.. ప్రజా సంక్షేమం కోణంలో చేస్తున్న పాలనాంశాలను గురించి సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి వస్తోన్న భారీ పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

READ MORE: Telusukada: ఫస్ట్ ఛాయిస్ నితిన్.. ‘తెలుసు కదా’ వెనుకున్న షాకింగ్ స్టోరీ..!

యూఏఐ పర్యటనపై బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న దుబాయ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు ఘనస్వాగతం లభించింది. స్థానిక భారతీయ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, దుబాయ్ నగర శాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విశ్వేశరరావు, ముక్కు తులసి కుమార్, తెలుగు సంఘం అధ్యక్షుడు మసీయోద్దీన్, ఇతర అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. చంద్రబాబును ఆహ్వానించేందుకు ప్రవాసాంధ్ర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. యూఏఈలో సీఎం మూడు రోజులపాటు పర్యటించనున్నారు.

Exit mobile version