NTV Telugu Site icon

CM Chandrababu: నా పాలనలో హడావుడి ఉండదు.. ప్రజలతో మమేకమే ప్రభుత్వ లక్ష్యం..

Chandrababu

Chandrababu

CM Chandrababu: నా పాలనలో హడావుడి ఉండదు.. ప్రజలతో మమేకమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత పాలన పోలీసు భయంతో గడిచింది.. స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి ఉండేది.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నారు.. ప్రజలు టీడీపీ కూటమిని గెలిపించారు.. అయితే, రాత్రికి రాత్రే మిరాకిల్స్ జరగవు.. అప్పులు చాలా ఉన్నాయి.. గత పాలన చూసి పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు.. రాష్ట్రం బ్రాండ్ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్య మంత్రిగా పనికి రాని వ్యక్తి పాలన చేశాడు.. ఇప్పుడు పాలన ఎలా చేయాలో నిరూపించాల్సిన భాధ్యత నాపై ఉందన్నారు..

Read Also: Road Accident: ఎక్స్‌ప్రెస్ వే మీద వేగంగా దూసుకొచ్చి పల్టీలు కొట్టిన కారు.. యువకుడు మృతి

ఇక, వాలంటీర్లు లేకపోతే పెన్షన్ లు రావని బెదిరించారు… సచివాలయానికి వచ్చి పెన్షన్ లు తీసుకోవాలని ఎండల్లో తిప్పారు.. పెన్షన్ ల కోసం తిరిగి తిరిగి 33 మంది వృద్దులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. గ్రామ సచివాలయం సిబ్బందితో ఒకే రోజులో రాష్ట్రం అంతా పెన్షన్ ల పంపిణీ చేస్తాం అన్నారు. ఇక, నా పాలనలో హడావుడి ఉండదు.. ప్రజలతో మమేకం అవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.. ఈ రోజు పంపిణీ చేస్తున్న పెన్షన్ లు చారిత్రాత్మ కం .. 1.20 కోట్లు ఒక్క పెనుమాక గ్రామంలోనే ఇస్తున్నాం.. గుంటూరుజిల్లా లో పెన్షన్ లు రూ.81 కోట్లు .. గుంటూరు జిల్లాలో ఈ రోజు 111 కోట్ల రూపాయలు పెన్షన్ ల రూపంలో పంపిణీ చేస్తున్నాం.. 28 రకాల పెన్షన్ లకు 4,408 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇస్తున్నాం అన్నారు. ఉదయం లేవగానే పెనుమాకలో లబ్ధి దారులకు పెన్షన్ ఇచ్చాను.. పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్న బాణావత్ పాములు కుటుంబానికి ఇల్లు కూడా కట్టించే భాధ్యత నాది అని హామీ ఇచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని చెప్పిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ.. ఆ దిశగా పనిచేస్తా అని తెలిపారు సీఎం చంద్రబాబు.