ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ‘ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్ 5న గురు పూజా దినోత్సవం జరుపుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తుంటాము. పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. అందుకే వారిని దైవస్వరూపులుగా భావిస్తుంటాం. ఎంతో బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్న గురువులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకే వారికి మనం సర్వదా కృతజ్ఞతతో ఉండాలి. ఉపాధ్యాయులను గౌరవించుకోవడమంటే మన సంస్కృతిని మనం గౌరవించుకోవడమే. అందుకే గురుపూజా దినోత్సవం ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా గురువులందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు.’ తెలిపారు సీఎం చంద్రబాబు.
Shah Rukh Khan: క్రికెట్ ‘కింగ్’ను అధిగమించిన బాలీవుడ్ కింగ్!
అలాగే.. ‘సమున్నత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర అనిర్వచనీయమైనది. దేశానికి జ్ఞాన సంపన్నులైన… అంకితభావం కలిగిన యువతను అందించేందుకు పాఠశాల, కళాశాల దశల నుంచే బోధన బాధ్యతల్లో ఉన్నవారు తపిస్తారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వృత్తిలో ఉన్నవారికి బోధనేతర బాధ్యతల భారం లేకుండా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఆ దిశగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యుల గౌరవమర్యాదలను ఈ ప్రభుత్వం కాపాడుతుంది. రేపటి పౌరులను తీర్చిదిద్దేందుకు గురువు స్థానంలో ఉన్నవారు కంకణబద్ధులు కావాలని కోరుకొంటున్నాను.’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
Rajasthan: శ్రీగంగానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి