Site icon NTV Telugu

Road Accident: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

Nellore

Nellore

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద అదుపుతప్పి రోడ్డుపన్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది కారు.. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. నెల్లూరు జిల్లాలో కారు ప్రమాదంలో ఆరుగురు మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.. ఇంట్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు అభిషేక్, జీవన్, నరేష్‌, యజ్ఞేష్, అభిసాయితో పాటు ఇట్లో ఉన్న వెంకటరమణయ్య మృతి చెందడం బాధాకరం అన్నారు.. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: India warns Pakistan: ఎల్ఓసీ, ఐబీ వెంబడి కాల్పులు.. పాకిస్తాన్‌కి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..

మరోవైపు.. పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముంబై జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌బంకు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్ధులు, మరొకరు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.. ఇక, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వైఎస్‌ జగన్..

Exit mobile version