NTV Telugu Site icon

CM Chandrababu: కరుడుకట్టిన పసుపు యోధుడు అయ్యన్న.. ఆయనది రాజీలేని పోరాటం..

Babu

Babu

CM Chandrababu: కరుడుకట్టిన పసుపు యోధుడు అయ్యన్నపాత్రుడు.. 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారు ఆయన అంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుపై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చింతకాలయ అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా సభా నాయకుడి హోదాలో తొలిసారి ఆయన సభలో చంద్రబాడు మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి.. ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యారు.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న తనదైన ముద్రవేశారు.. విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారంటూ కొనియాడరు..

Read Also: Education Minister: నీట్ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదంటే..?

ఇక, గత సభలో అసెంబ్లీని వాకౌట్ చేసిన సందర్భంగా తాను చేసిన ప్రకటనను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు.. కౌరవ సభలో తాను ఉండబోనని, సీఎంగానే సభలో అడుగుపెడతానని చెప్పానని.. తన కుటుంబ సభ్యులపై గత ప్రభుత్వ హయాంలో అమర్యాదగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, వైసీపీ పాలనలో ఎంతోమంది మహిళలు బాధపడ్డారు.. గౌరవసభగా శాసనసభను నడిపిస్తానని ప్రజలకు మాట ఇచ్చానని, రాష్ట్రంలో ఆడబిడ్డలకు గత పాలనలో జరిగిన అవమానం ఇంకెప్పుడూ జరగకూడదన్నారు.. తనకు మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని ఎగతాళిగా మాట్లాడారన్న ఆయన.. ఇప్పుడు వాళ్లకు 11 సీట్లకే పరిమితం అయ్యారు.. అది కూడా దేవుడే స్క్రిప్టే కదా? అని వ్యాఖ్యానించారు చంద్రబాబు.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..