NTV Telugu Site icon

Bhatti Vikramarka: కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు.. ఆమె ఇచ్చారు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడి వల్ల రాలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నో వందల మంది పోరాడితే సోనియా గాంధీ ఇచ్చారన్నారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కాంగ్రెస్‌ను విమర్శించడం బాధాకరమన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియమకాలు ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉన్నాయని వాటిని ప్రజలకు తీర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పై ఉందన్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీని 28రోజులు నడపాలన్న విషయాన్ని గుర్తు చేశారు.

Read Also:Fake Seeds: మంచిర్యాలలో రెచ్చిపోతున్న నకిలీ విత్తన మాఫియా

కానీ ప్రభుత్వం ఏడు రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ముగించారని భట్టి తెలిపారు. స్వరాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపుగా 17.39 లక్షల బడ్జెట్‌ను పెట్టినా, పేద ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. భూమిలేని నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. భూ సేకరణ చేసి ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. ప్రతి మండలంలో కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వమే పాఠశాలలు నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ప్రయివేటు యూనివర్శీటీల్లో ఫీజుల భారంతో చదువలేని పేద విద్యార్థులను ఆదుకోవాలన్నారు. దీంతో పాటు గ్రామ అభివృద్ధికి కృషిచేసే సర్పంచ్‌లకు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు.