Cloud Particle Scam: క్లౌడ్ పార్టికల్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడి నిర్వహించి సంచలనం సృష్టించింది. వ్యూనౌ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, దాని అనుబంధ వ్యక్తులపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారుల బృందం పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలోని 10 ప్రదేశాలలో ఒకే సమయంలో దాడులు నిర్వహించింది. ఈక్రమంలో ఈడీ రూ.73.72 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు, పంజాబ్ పోలీసులు దాఖలు చేసిన FIRల ఆధారంగా ఈడీ కేసును దర్యాప్తు చేస్తుంది. వ్యూనౌ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ డైరెక్టర్ రాహుల్ ఆనంద్ భార్గవ, గ్రూప్ CEO, వ్యవస్థాపకుడు సుఖ్‌విందర్ సింగ్ ఖరూర్‌తో పాటు అనేక మంది నిందితులను కేసు విచారణలో భాగంగా ఈడీ ప్రశ్నిస్తోంది.
READ MORE: Devara 2 : దేవర 2పై షాకింగ్ న్యూస్?
వేల కోట్ల రూపాయల స్కామ్..
సుఖ్వీందర్ సింగ్ ఖరూర్, అతని సహచరులు కలిసి వేల కోట్ల రూపాయల ‘క్లౌడ్ పార్టికల్ స్కామ్’కు పాల్పడ్డారని ఈడీ తన దర్యాప్తులో తేలిపింది. సేల్-అండ్-లీజ్‌బ్యాక్ (SLB) మోడల్ ఆధారంగా రూపొందించబడిన ఈ పథకం చాలావరకు కల్పితమైనదని పేర్కొంది. వ్యూనౌ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీకి క్లౌడ్ పార్టికల్స్ అద్దెకు తీసుకోవడానికి నిజమైన క్లయింట్లు లేరని, ఏ డేటా సెంటర్ క్లయింట్ నుంచి కూడా అది ఎటువంటి అద్దెను పొందలేదని స్పష్టం చేశారు. ఈ మొత్తం పథకం కేవలం డబ్బు సంపాదించడానికి వేసిన ఎత్తుగడ అని తెలిపింది. దర్యాప్తు ప్రారంభమైన తర్వాత కొత్త పెట్టుబడిదారులు రావడం మానేయడంతో VyNow గ్రూప్ పెట్టుబడిదారులకు అద్దె చెల్లించడం ఆపివేసిందని, వాస్తవానికి అద్దె చెల్లించడానికి క్లయింట్లు కూడా లేరని దర్యాప్తులో వెల్లడించింది. ఈడీ రైడ్స్‌లో రూ.23.90 లక్షల నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యమైన పత్రాలు, రూ.63.49 కోట్ల విలువైన షేర్లు, 9.99 కోట్ల విలువైన స్థిరాస్తులు మొత్తంగా రూ.73.72 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ గ్రూప్‌పై ఇదే మొదటి ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడి కాదు. 2024 నవంబర్ 26, 2025 జనవరి 17, 2025 ఫిబ్రవరి 24, తేదీల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. 2025 ఫిబ్రవరి 6 నాటి తాత్కాలిక ఉత్తర్వు ప్రకారం సుమారు రూ.178.12 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే సుఖ్వీందర్ సింగ్ ఖరూర్, డింపుల్ ఖరూర్, ఆరిఫ్ నిసార్‌లను అరెస్టు చేసింది. ప్రస్తుతం వీళ్లందరూ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.
READ MORE: Mahindra new SUVs 2025: ఇండిపెండెన్స్ డే గిఫ్ట్.. మహీంద్రా నుంచి 4 కొత్త SUV లు రిలీజ్