NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఇవాళ 33 జిల్లాల తహశీల్దార్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురి కావొద్దని, కలెక్టర్ అనుమతితోనే తహశీల్దార్ల పై కేసులు నమోదు చేయాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తహశీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములను కాపాడటంలో రెవెన్యూ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు పొంగులేటి స్పష్టం చేశారు.

Hassan Nasrallah: పేలుడు స్థలం నుంచి హిజ్బుల్లా చీఫ్ మృతదేహం రికవరీ.. మరణానికి కారణం ఇదే..

ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. “రెవెన్యూ కార్యాలయాలను సందర్శించే పౌరులకు సిబ్బంది పూర్తిగా సహకరించాలి. వారి సమస్యలను పరిష్కరించడానికి శ్రద్ధగా పని చేయాలి” అని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి.. పథకాలు ప్రజలకు చేరేలా చేయడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పొంగులేటి ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అంతరాన్ని పూడ్చడంలో తహశీల్దార్లదే కీలకపాత్ర అని కొనియాడారు. ప్రజలు ఆశించిన విధంగా రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందో లేదో ఉద్యోగులు ఆలోచించుకోవాలని కోరారు.

Manchu Vishnu: లడ్డూ వివాదంపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు..