NTV Telugu Site icon

TTDP : టీటీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు

Tdp

Tdp

ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన పాల్గొనే కార్యక్రమంలో రసాభాస కొనసాగుతుంది. రెండు వర్గాలు పార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా బ్యానర్లలో పేర్లు పెట్టి అంశంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.

Also Read : MP Margani Bharat: నేను 10 సినిమాల్లో హీరోగా చేయగలను.. నువ్వు కమెడియన్‌గా కూడా పనికిరావు..!

ఇరువర్గాలని సమన్వయం పరచడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దీంతో కాట్రగడ్డ ప్రసూన ఎదురుగానే రెండు వర్గాలు తోపులాట జరిగింది. రెండు వర్గాలు ఒకరి మీదకి ఒకరు వెళ్ళటం జరిగింది. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. గొడవపడుతున్న ఇరు వర్గాలని పోలీసులు విడదీశారు. కానీ రెండు వర్గాలు ప్రస్తుతం టీడీపీ కార్యాలయం వద్ద రెండు వర్గాలు ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Car Falls Into Gorge: లోయలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. మరో ఘటనలో ఐదుగురు