NTV Telugu Site icon

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ కుమ్ములాట.. ఈసారి సీఎం-డిప్యూటీ సీఎం మధ్య కాదు…

Karnataka

Karnataka

కర్ణాటక కాంగ్రెస్‌లో టెన్షన్ ఊహాగానాల మధ్య ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ కార్యాలయంలో క్రెడిట్‌పై చర్చ జరిగినట్లు సమాచారం. బహిరంగ ప్రకటనలు చేయవద్దని కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తమ పార్టీ ఎమ్మెల్యేలను కోరినట్లు చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా హైకమాండ్ సూచనలను పాటించాలని సూచించారు.

READ MORE: Delhi Election 2025: ఢిల్లీ సీఎం అతిషికి బిగ్ షాక్.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు కేసు నమోదు!

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఇద్దరు మంత్రులు సతీష్ జార్కిహోళి, లక్ష్మీ హెబ్బాల్కర్ మధ్య జరిగిన సమావేశంలో వాగ్వాదం జరిగింది. బెళగావిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన ఘనతను డిప్యూటీ సీఎం ప్రస్తావించడమే కారణం.. హెబ్బాల్కర్ జిల్లా స్థాయి కార్యాలయాన్ని నిర్ణించడంపై సోమవారం ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రశంసలు కురిపించారు. అలాగే సీనియర్ నేతలు తమ జిల్లాల్లో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో 100 పార్టీ కార్యాలయాలను తెరవాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.

READ MORE: Gaza Truce Deal: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. బందీలు విడుదలయ్యే ఛాన్స్..

నివేదిక ప్రకారం.. శివకుమార్ మాట్లాడుతుండగా జార్కిహోళి అడ్డగించారు. హెబ్బాల్కర్‌కు క్రెడిట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఈ భవన నిర్మాణానికి రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బీజేపీలో పని చేస్తున్న తన సోదరుడు రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై హెబ్బాల్కర్ మాట్లాడుతూ.. “సతీష్ నాకు అన్నలాంటి వాడు.. కానీ ప్రతిసారీ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. మన మధ్య పోరు కాదు.. ముందు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న ఉద్రిక్తతలను చూసిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా, పార్టీ ఐక్యతను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ఇద్దరు మంత్రులను కోరారు. కాంగ్రెస్ అప్రమత్తమైంది. మంత్రులతో సహా పలువురు కీలక నేతకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

 

Show comments