Andhrapradesh: కాకినాడ జిల్లాలోని తునిలో న్యూఇయర్ వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. న్యూఇయర్ వేడుకల్లో టీడీపీ శ్రేణుల మధ్య గొడవ జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తునిలోని సాయి వేదిక ఫంక్షన్ హల్‌లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సర వేడుకలలో యనమల రాజేష్, యనమల కృష్ణుడు వర్గాలు ఘర్షణకు దిగాయి. యనమల రామకృష్ణుడు, దివ్యలకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్తున్న రాజేష్ వర్గాన్ని కృష్ణుడు వర్గం అడ్డుకుంది.
Read Also: Kesineni Nani: నేను విజయవాడ పార్లమెంట్‌కు కాపలా కుక్కను.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అది కాస్తా చెలరేగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. కొంతకాలంగా ఎనమల కృష్ణుడు, యనమల రాజేష్ వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నట్లు సమాచారం.