CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Leaders Released: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నాయకులు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఆదివారం అధికారులు విడుదల చేశారు. శనివారం వీరు ముంబై నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి చేరుకోగానే విమానం లోపలే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్‌లోని అడిషనల్ సిటీ మేజిస్ట్రేట్ (ACM) కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు నుంచి విడుదలయ్యాక, “చివరకు ఢిల్లీ పోలీసులు అభిజీత్, అశుతోష్, సౌరవ్‌లను విడుదల చేయక తప్పలేదు. దీంతో “కాక్రోచ్లు ఎప్పటికీ చావవు” అంటూ సీజేపీ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.
శనివారం విమానం ల్యాండ్ అయిన వెంటనే మహిళా సిబ్బందితో కూడిన ఢిల్లీ పోలీసు బృందం లోపలికి వెళ్లి వీరిని అదుపులోకి తీసుకుంది. ప్యాసింజర్లు అంతా చూస్తుండగా, ఫోన్లలో రికార్డ్ చేస్తుండగా ఈ డ్రామా జరిగింది. “నేను అరెస్ట్ కావడానికే ఢిల్లీకి వచ్చాను” అంటూ అభిజీత్ దిప్కే పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మరోవైపు, నిరసనలకు ముందే గుర్గావ్లోని తన ఇంట్లో అదుపులోకి తీసుకున్న ప్రముఖ యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ ధృవ్ రాఠీని కూడా ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో విడుదల చేశారు. వీరికి సంబంధించి సీజేపీ లీగల్ టీమ్ హెడ్ రత్నా సింగ్ స్పందిస్తూ.. నాయకులను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నట్లు తమకు సమాచారం ఉందంటూ, తాము ఢిల్లీ కాంట్ పోలీస్ స్టేషన్ వద్ద లీగల్ టీమ్‌తో ఉంటామని శనివారమే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Also Read
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ఇంతకీ అసలు ఈ ముందస్తు నిర్బంధం (ప్రివెంటివ్ డిటెన్షన్) అంటే ఏమిటి?
భవిష్యత్తులో ఏదైనా నేరం జరగకుండా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరోధించడానికి పోలీసులు ఈ చర్యలు తీసుకుంటారు. పోలీసులు ఒకరిని వారెంట్ లేకుండా అరెస్టు చేస్తే, సరైన న్యాయపరమైన అనుమతి లేకుండా 24 గంటలకు మించి కస్టడీలో ఉంచకూడదు. కొత్తగా వచ్చిన భారతీ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) చట్టంలో సెక్షన్ 126 ప్రకారం ప్రశాంతతను కాపాడేందుకు బాండ్ దాఖలు చేయమని మేజిస్ట్రేట్ కోరవచ్చు. అలాగే సెక్షన్ 170 ప్రకారం కాగ్నిజబుల్ నేరం జరిగే అవకాశం ఉందని భావిస్తే పోలీసులు ముందస్తు అరెస్టు చేయవచ్చు, కానీ మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా 24 గంటలు దాటి ఉంచడానికి కుదరదు. మరోవైపు, సీనియర్ నాయకులు ముందస్తు నిర్బంధంలో ఉన్నప్పటికీ, సీజేపీ తన పోరాటాన్ని ఆపలేదు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఆదివారం ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద మళ్లీ భారీ మార్చ్‌కి పిలుపునిచ్చింది. అయితే, భద్రతా కారణాల వల్ల పోలీసులు ఈ నిరసనకు ముందే అనుమతి నిరాకరించారు. ఈ ఆందోళనలో సీజేపీతో పాటు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) కూడా భాగమైంది.
తాజావార్తలు
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..