Site icon NTV Telugu

CID: ఫాల్కన్ స్కాం కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరు అరెస్ట్..

Falcon Scam Case

Falcon Scam Case

ఫాల్కన్ స్కాం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో సీఐడీ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. తెలంగాణ సీఐడీ బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు A2 అమర్ దీప్ కుటుంబ సభ్యులు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కాంలో నేరస్థులుగా ఉన్నారని.. నేరంలో భాగస్వామ్యం కావడం లబ్ధిపొందారని సీఐడీ తెలిపింది.. కేసు అనంతరం ఇద్దరు నిందితులు రవీంద్ర ప్రసాద్ సింగ్, సుష్మ స్వరాజ్ (A21 సందీప్ భగస్వమి) స్వస్థలాలకు వెళ్లారని.. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆభరణాలు, బ్యాంక్ కార్డులు, ఇతర పత్రాలతో సహా నేరారోపణకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

READ MORE: Tulluru DSP Murali Krishna: నందిగం సురేష్ అరెస్ట్.. తుళ్లూరు డీఎస్పీ కీలక వ్యాఖ్యలు..

నిందితుల విచారణలో నేరం ద్వారా వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసిన మరిన్ని ఆస్తులను సీఐడీ గుర్తించింది. నిందితులను ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చి, న్యాయమూర్తి ముందు హాజరుపర్చనుంది. నిందితుల నుంచి రూ. 8,00,000/- నగదు, లాకిన్ విలువైన FDలు, పాస్పోర్ట్ లు, 9 మొబైల్ ఫోన్లు, 2 ట్యాబ్లు, బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు, చెక్కులు, ఆస్తి పత్రాలు, గుర్తింపు కార్డులు సీజ్ చేసింది.

READ MORE: Tulluru DSP Murali Krishna: నందిగం సురేష్ అరెస్ట్.. తుళ్లూరు డీఎస్పీ కీలక వ్యాఖ్యలు..

Exit mobile version