Site icon NTV Telugu

CID: కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు.. మరో ఇద్దరు అరెస్టు..

Arrested

Arrested

సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. తాజాగా సీఐడీ పోలీసులు కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు అరెస్టు చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. గతంలో 13 మందిని అరెస్టు చేశారు. కేసు సీఐడీకి బదిలీ అయిన తర్వాత ఇద్దరని అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన శంకరన్, రమ్య అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి పాస్‌పోర్టులతో పాటు రెండు మొబైల్ ఫోన్లో స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలో అదుపులోకి తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాత్‌కి తీసుకొచ్చారు. వీరు తమిళనాడులో పేద వారిని టార్గెట్ చేసి కిడ్నీ డొనేట్ చేపించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.10 లక్షలు వసూలు చేశారు. కిడ్నీ డొనేట్ చేసిన వారికి 4 లక్షల రూపాయలు చెల్లించారు.

READ MORE: India VS Pakistan: 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్, అప్పుల ఊబిలో పాకిస్తాన్.. దాయాదుల మధ్య ఎంత తేడా..

అయితే.. 2023లోనూ ఏపీలోని విశాఖపట్నంలో కిడ్నీ మార్పిడి కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా.. అప్పట్లో వైజాగ్‌, చెన్నై, హైదరాబాద్‌లో ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ రాజశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఇప్పుడు అలకనంద ఆస్పత్రి కేసులో కూడా రాజశేఖర్‌ అనే డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ రెండు కేసుల్లో రాజశేఖర్‌ ఒక్కడేనా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

READ MORE: India VS Pakistan: 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్, అప్పుల ఊబిలో పాకిస్తాన్.. దాయాదుల మధ్య ఎంత తేడా..

Exit mobile version