NTV Telugu Site icon

Tollywood Movies : క్రిస్మస్ జాతర.. ముగ్గురిలో విజేత ఎవరవుతారు ?

New Project (46)

New Project (46)

Tollywood Movies : పండుగలు వస్తున్నాయంటే చాలు.. పలువురు హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోతుంటాయి. స్టార్ హీరోల నుంచి మీడియం, రేంజ్ హీరోల వరకు అంతా అప్పుడే వారి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నా.. అప్పుడే తాము నటించిన సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా.. ఆ సమయంలో మూవీకి మంచి వసూళ్లు రావడం మాత్రం పక్కా.. ఈ ఈక్వేషన్ ను ఫాలో అవుతారు హీరోలు అంతా . ఇప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చేస్తున్న నేపథ్యంలో పలు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. కొన్ని ఇప్పటికే ఫిక్స్ అవ్వగా.. ఇంకొన్ని ప్రాజెక్టుల ప్రకటన త్వరలోనే రానున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం..

Read Also:Benjamin Netanyahu: ఇజ్రాయెల్‌ ప్రధానిపై అరెస్టు వారెంట్లు జారీ

యంగ్ హీరో నితిన్.. రాబిన్ హుడ్ సినిమాతో క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 20న మూవీ రిలీజ్ చేస్తామని మరోసారి చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్.. రాబిన్ హుడ్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆ తర్వాత అల్లరి నరేష్.. ఇటీవల క్రిస్మస్ రేసులో దిగారు. బచ్చల మల్లితో 20వ తేదీనే రాబోతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ డ్రామాగా సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో అల్లరి నరేష్ లుక్స్.. ఊరమాస్ అన్నట్లుగా కనిపిస్తున్నాయి. దీంతో సినిమా పై ఫుల్ హోప్స్ ఉన్నాయి. అదే రోజున కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి కూడా రానున్నారు.

Read Also:PM Modi: మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న సారంగపాణి జాతకం సినిమాతో రాబోతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌, నారా రోహిత్‌, మంచు మనోజ్‌ తొలిసారిగా కలిసి నటిస్తున్న భైరవం చిత్రం.. కూడా క్రిస్మస్ స్పెషల్ గా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన హీరోల లుక్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరోవైపు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విడుతలై-2 మూవీ క్రిస్మస్ రేసులో ఉంది. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా చాలా గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో క్రిస్మస్ రేసులో మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి. మరి వాటిలో ఏది బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలుస్తుందో వెయిట్ అండ్ సీ.

Show comments