NTV Telugu Site icon

Thangalaan Twitter Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Thangalaan Twitter Review

Thangalaan Twitter Review

Thangalaan Movie Twitter Review: ‘చియాన్’ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్‌’. పా రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ సినిమాలో మాళవిక మోహనన్‌ కథానాయికగా నటించారు. పార్వతి తిరువోతు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు (ఆగస్టు 15) తంగలాన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ చూసిన వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Also Read: Manu Bhaker: నీరజ్‌ చోప్రాతో ప్రేమ.. స్పందించిన మను బాకర్‌!

తంగలాన్‌ సినిమాకు మిశ్రమ రివ్యూస్ వస్తున్నాయి. కొందరు సినిమా బాగుందంటుంటే, మరికొందరేమో ఫ్లాఫ్ అంటున్నారు. అందరూ మాత్రం విక్రమ్ నటన మరో లెవల్ అని ట్వీట్స్ చేస్తున్నారు. ‘సినిమా అస్సలు మిస్ అవ్వొద్దు. ఇది తంగలాన్‌ రోజు’, ‘అక్కడక్కడ కొన్ని లాగ్‌లు ఉన్నాయి కానీ మొత్తంగా ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా’, ‘చియాన్ విక్రమ్ భారీ హిట్ కొట్టాడు’, ‘ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ బాగుంది’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘కథ ఎంపికలో విక్రమ్ తడబడ్డాడు, ఫెయిల్యూర్స్ కంటిన్యూ అవుతున్నాయి’, ‘సారీ చియాన్’ అంటూ నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

Show comments