Manu Bhaker: నీరజ్ చోప్రాతో ప్రేమ.. స్పందించిన మను బాకర్!
- పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు
- నీరజ్‌తో మను మాట్లాడిన వీడియో వైరల్
- మా మధ్య పెద్దగా ఇంటరాక్షన్ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manu Bhaker reacts on Love With Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలు సాధించి రికార్డు సృష్టించిన భారత షూటర్ మను బాకర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. మను ఏం చేసినా అది ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో మను మాట్లాడిన వీడియో ఇటీవల వైరల్ అయింది. అంతేకాదు మను తల్లి నీరజ్‌తో మాట్లాడడం, తలపై చోప్రా చేతిని ఉంచి ఒట్టు తీసుకున్నట్లుగా కనిపించడంతో నెట్టింట ఊహాగానాలు మరో స్థాయికి వెళ్లాయి. మనుతో నీరజ్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఇద్దర పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి.
నీరజ్ చోప్రాతో ప్రేమ, పెళ్లి వార్తలను మను బాకర్ కుటుంబసభ్యులు ఖండించారు. తాజాగా మను కూడా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ‘నెట్టింట వచ్చిన వార్తలను నేను కూడా విన్నాను. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నీరజ్ చోప్రాతో నేను మాట్లాడాను. అప్పుడు ఎవరో వీడియో తీశారు. మా మధ్య పెద్దగా ఇంటరాక్షన్ లేదు. ఈవెంట్ల సందర్భంగా కలిసినప్పుడే మాట్లాడుకుంటాం. మేమిద్దరం ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. మా అమ్మ నీరజ్‌తో మాట్లాడినప్పుడు నేను అక్కడ లేను. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు’ అని మను చెప్పారు.
Also Read
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచింది. షూటర్ సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మరో కాంస్య పతకం కైవసం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేశ్‌తో కలిసి భారత పతాకధారిగానూ మను వ్యవహరించారు. మరోవైపు జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా రజతం సాధించాడు.
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!