Vishvambhara : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన ఫలితంతో మెగాస్టార్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఈ సారి మంచి హిట్ సినిమాతో రావాలని చూస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్టతో ఓ సినిమా చేస్తున్నారు. విశ్వంభర టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతుంది. దీంతో విశ్వంభరపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also:Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది..
ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో విశ్వంభర ఎప్పుడు రిలీజవుతుందా అని అంతా ఆసక్తిగా ఉన్నారు. నిజానికి విశ్వంభర ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ లో జాప్యం, వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కావడం వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. సినిమాను వాయిదా అయితే వేశారు కానీ మళ్లీ కొత్త రిలీజ్ డేట్ మాత్రం మేకర్స్ ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు.
Read Also:Bangladesh: అవమానాలు మరిచిపోయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్‌తో తొలిసారిగా వాణిజ్యం..
ఇదిలా ఉండగా విశ్వంభర మూవీ ఆడియో గురించి ఫిల్మ్ నగర్లో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. కీరవాణి ఈ సినిమాకు నెక్ట్స్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడని.. మెగాఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవడం ఖాయమంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే డైరెక్టర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే విశ్వంభరకు సంబంధించిన ఓ మాస్ సాంగ్ ను తెరకెక్కించారట. రాముల వారిపై రామ రామ అంటూ సాగే ఈ పాట ఎంతో అద్భుతంగా వచ్చిందని, ఈ పాటలోనే హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కనిపిస్తాడని అంటున్నారు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఈ పాటను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఉగాదికి ఈ సాంగ్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.