Chiranjeevi: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలయ్యాడు.. అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చారు.. సింగపూర్‌లో జరిగిన ఈ ఘటనతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన శ్రేణులు ఆందోళనలో ఉండగా.. పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.. 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని తెలిపారు.. మార్క్ శంకర్ కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు చిరంజీవి..
Read Also: Supreme Court: మమతా ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. సీబీఐ దర్యాప్తును రద్దు చేసిన సుప్రీంకోర్టు..
కాగా, సింగపూఖలోని రివర్‌వాలీ ప్రాంతంలో వున్న టొమోటో కుకింగ్ స్కూల్‌లో చదువుకుంటున్నాడు పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్.. చిన్న పిల్లలకు వంటల పాఠాలు చెప్పే స్కూల్‌గా పాపులర్ అయ్యింది టొమోటో కుకింగ్ స్కూల్.. అయితే, ఉదయం ఈ స్కూల్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.. అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌తో పాటు మరో 14 మంది చిన్నారులు, నలుగురు పెద్దవాళ్లు తీవ్రంగా గాయపడ్డారు.. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
Read Also: Supreme Court: తమిళనాడు గవర్నర్‌కు సుప్రీం ధర్మాసనం చీవాట్లు
ఇక, మన్యం పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన పర్యటనను కుదించుకుని.. హుటాహుటిన విశాఖపట్నం నుంచి సింగపూర్ బయల్దేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. మరోవైపు.. ఈ ఘటనపై ట్విట్టర్‌లో స్పందించారు మంత్రి నారా లోకేష్.. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. ఈ ప్రమాదంలో పవన్ కల్యాణ్ అన్నా కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఆయన త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి బలం చేకూర్చాలని పార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు లోకేష్.. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ జనసేన అధినేత పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరి కాయలు కొట్టి మొక్కుకున్నారు జనసేన నాయకులు.. పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలపై ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్.. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను.. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు..
