NTV Telugu Site icon

Chiranjeevi : దటీజ్ చిరు.. ఆయనకు అభిమానులంటే ఎంత గౌరవమో తెలుసా ?

New Project (22)

New Project (22)

Chiranjeevi : మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన హీరోగా ప్రస్తుతం విశ్వంభర అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార ఫేమ్.. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలోనే మెగా స్టార్ కు పలు అరుదైన గౌరవాలు దక్కాయి. మొదటిగా దేశంలోని అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవిని వరించగా మొన్ననే గిన్నిస్ వరల్డ్ రికార్డుని కూడా మెగాస్టార్ కైవసం చేసుకుని టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర చరిత్ర సృష్టించారు.

Read Also:DSC Results 2024: నేడే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం..

ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ(ఐఫా) – 2024 అవార్డ్స్ లో కూడా మెగాస్టార్ అవుట్ స్టాండింగ్ అఛీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ మరో స్పెషల్ అవార్డుని గెలుచుకున్నారు. అబుదాబిలో జరుగుతున్న ఈ వేడుకలకు చిరంజీవి హాజరై ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఇలా తన కెరీర్ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న చిరు ఆ అవార్డు వేడుకలో చేసిన కామెంట్స్ మెగా అభిమానులని మరింత ఆనందంలో ముంచేశాయి. తనకి తన అభిమానులని మించిన అవార్డు ఇంకొకటి లేదన్నారు. వారి తర్వాతే మిగతా అవార్డులు అనే రీతిలో తన అభిమానులకి తన గుండెల్లో ఎలాంటి స్థానం ఉందో చెప్పకనే చెప్పారు. దీనితో చిరు విషయంలో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:Israeli Strike: బీరుట్‌లో ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. నలుగురు మృతి

ఐఫా 2024 పురస్కారాల్లో మరో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ గోల్డెన్‌ లెగసీ పురస్కారాన్ని, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ ఔట్‌ స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా, హీరోయిన్ సమంత ‘ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాల్ని అందుకున్నారు. ఉత్తరాది, దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. నాని – శ్రీకాంత్‌ ఓదెల కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘దసరా’ చిత్రానికి పలు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. తెలుగు నుంచి సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌ కలిసి సందడి చేయడం వేడుకకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Show comments