Indra Re Release: ఇంద్ర సేనారెడ్డి అంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా: చిరంజీవి
- ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు
- వైజయంతీ మూవీస్ యాభయ్యేళ్ల సంబరాలు
- ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అంటున్న చిరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Talks About Indra Re Release: ‘మెగాస్టార్’ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఇందులో చిరు డైలాగ్స్, నటన, మ్యానరిజం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడిగా చిరంజీవి సహా మొత్తం మూడు నంది పురస్కారాలు, రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. సినీ ప్రియులపై అంతగా ప్రభావం చూపిన ఇంద్ర.. రీ-రిలీజ్ కాబోతోంది.
చిరంజీవి పుట్టినరోజు, అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ యాభయ్యేళ్ల సంబరాలను పురస్కరించుకొని ఇంద్ర సినిమాని ఆగస్టు 22న రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇంద్ర రీ-రిలీజ్‌సందర్భంగా చిరంజీవి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వీడియోను వైజయంతీ మూవీస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Also Read: VidaaMuyarchi: అజిత్ ‘విదాముయార్చి’ రిలీజ్ డేట్ లాక్!
ఇంద్ర సినిమా చూసే ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అని, బాగా ఎంజాయ్ చేయండని చిరంజీవి అన్నారు. ‘ఇంద్ర.. ఇంద్ర సేనారెడ్డి.. అంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అది పవర్ ఆఫ్ ఇంద్ర. అలాంటి పవర్ ఫుల్ సినిమా, పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇంద్ర. అంతటి ప్రజాదరణ పొందడానికి కారణం చిత్ర కథ. సినిమా కోసం ప్రతిఒక్కరు చాలా కష్టపడ్డారు. నా చిత్రాల్లో అత్యంత సాంకేతిక విలువలున్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర. 22 సంవత్సరాల రీ-రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది. చాలా భావోద్వేగానికి గురవుతూన్నా. ఇంద్ర సినిమా చూసే ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా. బాగా ఎంజాయ్ చేయండి’ అని చిరు అన్నారు.
Indra Sena Reddy is back 💥💥💥
Our dearest Megastar @KChiruTweets garu reflects on the journey of #INDRA and shares his excitement for the worldwide grand re-release on August 22nd. 🤗https://t.co/wdY0I7hZiE#Indra4K @AshwiniDuttCh #BGopal @iamsonalibendre #AarthiAgarwal… pic.twitter.com/gZWrBcBvV8
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 20, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!