Site icon NTV Telugu

Chiranjeevi Birthday: ‘మెగా’ బ్లాస్టింగ్ లోడింగ్.. చిరంజీవి బర్త్ డేకి అదిరిపోయే అప్డేట్స్!

Chiranjeevi Birthday 2025

Chiranjeevi Birthday 2025

Megastar Chiranjeevi Birthday Blast Loading: ‘మెగాస్టార్’ చిరంజీవి వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టారు. ఇప్పటికే ‘విశ్వంభర’ షూటింగ్ ఫినిష్ చేశారు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ.. విజువల్ వండర్‌గా రాబోతోంది. ఇదే ఏడాదిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ తర్వాత అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ దూసుకుపోతోంది. అనుకున్న దాని కంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అనిపిస్తోంది.

అనిల్ రావిపూడి సినిమా తర్వాత.. ‘దసరా’ డైరెక్డర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అలాగే బాబీ లాంటి దర్శకులు మెగాస్టార్ లిస్ట్‌లో ఉన్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న చిరంజీవి.. ఈసారి తన బర్త్ డేకి అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే ఉంది. ఈ సంద‌ర్భంగా మెగా 157 టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. టైటిల్‌తో పాటూ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయాల‌ని ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ బాత్రూమ్‌లో ఏడ్చాడు.. ఆసక్తికర విషయం చెప్పిన చహల్‌!

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విశ్వంభర నుంచి సాలిడ్ అప్టేట్ కూడా చిరంజీవి బ‌ర్త్ డే రోజున వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దీంతో ఈసారి బర్త్ డే గిఫ్ట్‌గా విడుదల తేదీతో పాటు సాలిడ్ గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా మరో మూడు వారాల్లో మెగా బ్లాస్టింగ్ జరగబోతుందనే చెప్పాలి. చిరంజీవి ఫాన్స్ బర్త్ డే కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానులకు చిరు ఏం సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.

Exit mobile version