మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే వినోదానికి గ్యారెంటీ అని ఇటీవలే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిరూపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ఈ భారీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి మరోసారి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వీరిద్దరి మధ్య కుదిరిన బాండింగ్, సినిమా ఫలితం పట్ల మెగాస్టార్ ఎంతో సంతోషంగా ఉన్నారు. చిరంజీవి సాధారణంగా కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారు మరోపక్క అనిల్ రావిపూడి తన చిత్రాల్లో కామెడీని, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో చిరుని సరికొత్త కామెడీ టైమింగ్‌తో చూపించి ఫ్యాన్స్‌కు పసందైన వినోదాన్ని అందించారు, ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ALso Read:Murali Mohan : లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: పద్మశ్రీపై మురళీ మోహన్
ఈ సినిమా సక్సెస్ చూసి ముగ్ధుడైన చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడికి ఇటీవలే ఒక ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును బహుమతిగా ఇచ్చారు. అలాగే అనిల్ రావిపూడి ఇప్పటికే ఒక లైన్ చిరంజీవికి వినిపించినట్లు, అది మెగాస్టార్‌కు బాగా నచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ప్రస్తుతం చిరంజీవి బాబీ కోల్లి దర్శకత్వంలో రాబోయే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది, అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి మెగాస్టార్ గ్రేస్ తోడైతే థియేటర్లలో నవ్వుల పూత పూయడం ఖాయం. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అందించిన జోష్‌ను కొనసాగిస్తూ రాబోయే ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
