NTV Telugu Site icon

Chiranjeevi-Anil Ravipudi: చిరంజీవి-అనిల్ ‘మెగా’ స్పీడ్.. త్వరలోనే సెకండ్ హాఫ్‌?

Chiranjeevi Anil Ravipudi

Chiranjeevi Anil Ravipudi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీపై భారీ అంచనాలున్నాయి. కుదిరితే సమ్మర్‌ లేదా ఆగష్టులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది విశ్వంభర చిత్ర యూనిట్. మరోవైపు గ్రాఫిక్స్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా చేయబోతున్నారు.

పోయిన సంక్రాంతికి అనిల్ రావిపూడి ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు అదే జోష్‌లో చిరంజీవి సినిమాను పట్టాలెక్కించడానికి పరుగులు పెడుతున్నాడు. మెగాస్టార్ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా స్క్రిప్ట్ స్టేజీలోనే ఉంది. ఇటీవల వైజాగ్‌లో తన టీమ్‌తో కలిసి డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు. కానీ అప్పుడే డైలాగ్ వెర్షన్‌తో సహా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్‌ను లాక్ చేశాడట. త్వరలోనే హైదరాబాద్‌లో సెకండ్ హాఫ్‌ని కూడా పూర్తి చేయనున్నారట.

Also Read: Raja Saab: ‘ది రాజాసాబ్‌’ నెక్స్ట్ లెవల్.. టీజర్ లోడింగ్?

మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయంలో కీలక పాత్ర పోషించిన భీమ్స్ సిసిరోలియో చిరంజీవి మూవీకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేశాడట భీమ్స్. సమ్మర్‌లో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేలా చిత్ర యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. మరి మెగాస్టార్‌తో అనిల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.