NTV Telugu Site icon

Chintakayala Vijay: అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారు

Vijay C

Vijay C

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత చింతకాయల విజయ్. హైదరాబాదులో మా ఇంటి పైకి సీఐడీ అధికారులు వచ్చారు.చిన్న పిల్లలను కూడా బెదిరించారు.దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ విచారణకు వచ్చానన్నారు. నన్ను మెటీరియల్ ఏమీ అడగవద్దని కోర్టు చెప్పింది.వాళ్ల విచారణకు సహకరించాలని వచ్చాను. ఈ నెల 27న విచారణకు రావాలని చెప్పింది. నాకు ఆ రోజు వేరే పని ఉండటంతో రాలేదు. కోర్టు అనుమతి తీసుకుని ఇవాళ విచారణకు వచ్చాను.

బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టింది. సెంటు భూమి కోసం మా ఇంటిపై 500 మంది పోలీసులతో దాడి చేశారు. అక్రమ కేసులతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు విజయ్ పై కేసు పెట్టారు.ఉన్నత విద్యావంతుడైన విజయ్ పై కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు.అయ్యన్నపాత్రుడు కుటుంబం నీతి నిజాయితీతో బతుకుతోంది.సెంటు భూమి కోసం ప్రభుత్వ అధికారులతో కేసు పెట్టించారు.తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరక్షన్లో ఇదంతా జరుగుతోంది.ఇలా సజ్జల మాట విన్న గౌతం సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలి.భూమి గుండ్రంగా తిరిగినట్లు మాకూ సమయం వస్తుంది.అవినీతి సొమ్ము కాపాడుకునేందుకు కొడాలి, పేర్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం కోసం బూతులు తిడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నానిలు ఇద్దరూ హైదరాబాద్ లో దాక్కున్నారు.ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్లు ఈ దేశంలోనే ఉండరు.

Read Also: Hansika: అరుదైన ప్రయోగంలో హన్సిక ప్రధాన పాత్ర…

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైకో ప్రభుత్వం నడుస్తోంది. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం ప్రజల కోసం పోరాడుతుంది.అందుకే వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు.విజయ్ కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.సైకో ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.వివేకా హత్య కేసులో సీబీఐ వీడియో విచారణ చేయాలని అవినాష్ రెడ్డి చెబుతున్నారు.కానీ ఇతరులను మాత్రం వీడియో విచారణ లేకుండా వేధిస్తున్నారు. కోటేశ్వరరావు, చింతకాయల విజయ్ న్యాయవాది.భారతీ పే యాప్ వ్యవహారంలో విజయ్‌పై కేసు పెట్టారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని హైకోర్టు చెప్పింది. సీఐడీ అధికారులు చాలా రకాల వస్తువులు తీసుకుని రమ్మన్నారన్నారు.

Read Also: Water Tax: భూమిలోని నీటిని తోడితే ట్యాక్స్ కట్టాల్సిందే.. ప్రభుత్వం సంచలన నిర్ణయం