NTV Telugu Site icon

Chinna Reddy : విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చేయవద్దు.. త్వరలో 20వేల డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్‌

Chinnareddy

Chinnareddy

విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చేయవద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సూచించారు. 20 వేల డీఎస్సీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మొదటి విడుదల 11 వేల డీఎస్సీ పోస్టులు వేసామని, మరో ఆరు నెలల్లో మిగిలిన పోస్టులకు భర్తీకి డీఎస్సీ వేస్తామని ఆయన వెల్లడించారు. గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, డీఎస్సీ వాయిదా పడకపోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిసారి సచివాలయం సీఎం ఇంటిని ముట్టడించడం భాగం కాదని ఆయన తెలిపారు. మీ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవనానికి రండి అని ఆయన తెలిపారు. మేము వింటాము ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తామని చిన్నారెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు విద్యార్థులను రెచ్చగొట్టవద్దని ఆయన అన్నారు. ఇలాంటి చిల్లర ఉద్యమాల వల్ల పలచన అవుతారని, ఈ ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండన్నారు. కృత్తిమ ఉద్యమాలకు విద్యార్థులు బలి కావద్దని, ఈ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఉందన్నారు చిన్నారెడ్డి.

 

డీఎస్సీని వాయిదా వేయవచ్చు కానీ, కోచింగ్ సెంటర్ల నిర్వాహకము వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్థుల తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజా భవాని రావాలని, ప్రజావాణి వచ్చి సమస్య చెప్పుకోండన్నారు. విద్యార్థులు అవసరమైతే మమ్మల్ని కొట్టినా కూడా పడేందుకు సిద్ధమన్నారు చిన్నారెడ్డి. గత ప్రభుత్వం ఎందుకు డీఎస్సీ పోస్టులు భర్తీ చేయలేదని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చారన్నారు. అందరికి ఉద్యోగాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని, ఖజానా ఖాళీగా ఉందన్నారు. అయినా ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు చిన్నారెడ్డి.