China: చైనా మాజీ అధ్యక్షుడికి భంగపాటు.. హు జింటావోను బలవంతంగా లాక్కెళ్లారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా కమ్యూనిస్టు పార్టీ 20 మహాసభలు నేటితో ముగియనుండగా.. ఆ సమావేశాల్లో డ్రామా చోటుచేసుకుంది. అయిదేళ్లకు ఒకసారి జరిగే సీపీసీ సమావేశాలు గత ఆదివారం ప్రారంభం అయ్యాయి. కాగా నేడు చివరిరోజు కాగా.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోను సమావేశాల నుంచి బయటకు తీసుకెళ్లారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ ఆడిటోరియంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పక్కనే కూర్చొని ఉన్న మాజీ అధ్యక్షుడు హు జింటావోను కొందరు సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. హు జింటావో జిన్‌పింగ్‌కు ముందు చైనాకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ సమయంలో జిన్‌పింగ్ పక్కనే ఉన్నా ఏమి మాట్లాడలేదు. నిజానికి అక్కడ ఏం జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ హు జింటావోను బలవంతంగానే లాక్కెళ్లినట్లు కనిపించింది.
T20 World Cup: కాన్వే 92 నాటౌట్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
హు జింటావో వయస్సు ప్రస్తుతం 79 ఏళ్లు. మహాసభల్లో పాల్గొన్న హు జింటావో.. గత ఆదివారం సభ ప్రారంభ సమయంలో స్టేజ్‌పైకి వచ్చినప్పుడు కూడా స్థిమితంగా కనిపించలేదు. స్టీవార్డ్స్ తీసుకువెళ్తున్న సమయంలో హు జింటావో.. ప్రధాని లీ కీక్వాంగ్ భుజంపై చేయి వేశారు. సమావేశాల నుంచి వెళ్లిపోవడానికి ఇష్టం లేకున్నా.. బలవంతంగా హు జింటావోను తీసుకువెళ్లినట్లు వీడియోలో కనిపించింది. 2013లో జింటావో రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. కొందరు సిబ్బంది వెంట ఉండి ఆయన్ను తీసుకెళ్లిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇవాళ ముగింపు సమావేశాల సందర్భంగా కొన్ని తీర్మానాలను ఆమోదించారు. కమ్యూనిస్టు పార్టీ మహాసభల సందర్భంగా చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి సీపీసీ ఎన్నుకోనుంది. అధ్యక్షుడిగా మూడోసారి జిన్‌పింగ్ బాధ్యతలు చేపడుతున్నప్పటికీ.. అది జీవితకాలం ఉండే అవకాశం ఉంది.
Early drama: Hu Jintao seen being led out soon after reporters are led into the main hall pic.twitter.com/pRffGZF60I
— Danson Cheong (@dansoncj) October 22, 2022
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?