AI Technology: త్వరలో ఏఐ- ఆధారిత శృంగార రోబోలు..
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ తో చైనా విప్లవాత్మక నిర్ణయం..
- ఏఐ- ఆధారిత సెక్స్ డాల్స్ డెవలప్ చేస్తున్న డ్రాగన్ కంట్రీ..
- భవిష్యత్ లో శృంగారం కోసం వీటిపై ఆధారపడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Technology: ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ రాకతో అందరి ఆలోచనలను పూర్తిగా మార్చేస్తోంది. ఎంతలా అంటే, ఏకంగా భవిష్యత్తులో శృంగారం కోసం కూడా ఒక మనిషికి మరో మనిషికి సంబంధం లేదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనా అలాంటి సెక్స్ డాల్స్ ను రూపొందిస్తుంది. ఇందులో భాగంగానే సెక్స్ డాల్ పరిశ్రమను డెవలప్మెంట్ చేసేందుకు వినియోగదారులతో మాట్లాడగలిగే ఏఐ -ఆధారిత సెక్స్ డాల్స్ (సహచరులను)ను తయారు చేస్తున్నట్లు పేర్కొనింది.
Read Also: Karnataka : సబ్బు మీద కాలేసి జారిన మహిళ.. రక్షించేందుకు తీవ్రంగా యత్నించిన భర్త.. కానీ..
Also Read
ఇక, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనీస్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సెక్స్ రోబోట్లకు చాట్ జీపీటీ- వంటి సాంకేతికతను వర్తింపజేస్తున్నారు. ఈ టెక్నాలజీతో నైతిక సవాళ్లను ఎదుర్కొంటూ ఇంటరాక్టివ్, ఏఐ- శక్తితో కూడిన భాగస్వాములను సృష్టించేందుకే లక్ష్యంగా పని చేస్తున్నారు. అయితే, షెన్జెన్లో, సెక్స్ డాల్స్లో ప్రధాన ఉత్పత్తిదారు అయిన స్టార్‌పెరీ టెక్నాలజీ కంపెనీ.. ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో వీటి ఉత్పత్తిని మెరుగుపరచడానికి ఈ రోబోలకు వారి మాతృభాషాలోనే ట్రైనింగ్ ఇస్తోంది. అద్భుతమైన సామర్థ్యాలు కలిగిన ఈ సెక్స్ డాల్స్, మగ లేదా ఆడ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి.. ఇవి త్వరలోనే మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్నాయని స్టార్‌పెరీ టెక్నాలజీ సీఈఓ ఇవాన్ లీ వెల్లడించారు.
Read Also: IND vs BAN: నేడు బంగ్లాతో సూపర్-8 మ్యాచ్.. సెమీస్‌పై భారత్ కన్ను!
కాగా, మేము తర్వాతి తరం సెక్స్ డాల్‌ను అభివృద్ధి చేస్తున్నాము.. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని స్టార్‌పెరీ టెక్నాలజీ సీఈఓ ఇవాన్ లీ వెల్లడించారు. ఈశృంగార బొమ్మలు నేరుగా మానవులతో ఇంటరాక్టివ్ అవుతాయి.. వారికి తిరిగి సమాధానం కూడా చెప్పే విధంగా వీటిలో ప్రత్యేక సాఫ్ట్వేర్ జోడిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాగా, కొత్త తరం సెక్స్ డాల్స్, ఏఐ మోడల్స్‌తో ఆధారితం కాబట్టి.. వీటికి సెన్సార్లతో అమర్చబడి ఉంటాయన్నారు. ఈ సెక్స్ డాల్స్ లో ప్రాథమిక సంభాషణ సామర్థ్యాలపై కాకుండా భావోద్వేగ కనెక్షన్‌పై దృష్టి సారించడం ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తాయని స్టార్‌పెరీ టెక్నాలజీ సీఈఓ ఇవాన్ లీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!