సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనీస్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సెక్స్ రోబోట్‌లకు చాట్ జీపీటీ- వంటి సాంకేతికతను వర్తింపజేస్తున్నారు. ఈ టెక్నాలజీతో నైతిక సవాళ్లను ఎదుర్కొంటూ ఇంటరాక్టివ్, ఏఐ- శక్తితో కూడిన భాగస్వాములను సృష్టించేందుకే లక్ష్యంగా పని చేస్తున్నారు.
ఎప్పుడూ ఏదో ఒక భారీ ప్రయోగం చేసే చైనా.. ఒకే రోజు రెండు భారీ సైన్సు ప్రాజెక్టులను ప్రారంభించింది. మంగళవారం ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగా.. మరోవైపు షింజియాంగ్ ప్రావిన్స్‌లో అత్యంత లోతైన బోర్ తవ్వకానికి శ్రీకారం చుట్టింది. ఈ బోర్ లోతు 10,000 మీటర్లు ఉండనుంది.