NTV Telugu Site icon

AI Technology: త్వరలో ఏఐ- ఆధారిత శృంగార రోబోలు..

China

China

AI Technology: ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ రాకతో అందరి ఆలోచనలను పూర్తిగా మార్చేస్తోంది. ఎంతలా అంటే, ఏకంగా భవిష్యత్తులో శృంగారం కోసం కూడా ఒక మనిషికి మరో మనిషికి సంబంధం లేదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనా అలాంటి సెక్స్ డాల్స్ ను రూపొందిస్తుంది. ఇందులో భాగంగానే సెక్స్ డాల్ పరిశ్రమను డెవలప్‌మెంట్ చేసేందుకు వినియోగదారులతో మాట్లాడగలిగే ఏఐ -ఆధారిత సెక్స్ డాల్స్ (సహచరులను)ను తయారు చేస్తున్నట్లు పేర్కొనింది.

Read Also: Karnataka : సబ్బు మీద కాలేసి జారిన మహిళ.. రక్షించేందుకు తీవ్రంగా యత్నించిన భర్త.. కానీ..

ఇక, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనీస్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సెక్స్ రోబోట్‌లకు చాట్ జీపీటీ- వంటి సాంకేతికతను వర్తింపజేస్తున్నారు. ఈ టెక్నాలజీతో నైతిక సవాళ్లను ఎదుర్కొంటూ ఇంటరాక్టివ్, ఏఐ- శక్తితో కూడిన భాగస్వాములను సృష్టించేందుకే లక్ష్యంగా పని చేస్తున్నారు. అయితే, షెన్‌జెన్‌లో, సెక్స్ డాల్స్‌లో ప్రధాన ఉత్పత్తిదారు అయిన స్టార్‌పెరీ టెక్నాలజీ కంపెనీ.. ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో వీటి ఉత్పత్తిని మెరుగుపరచడానికి ఈ రోబోలకు వారి మాతృభాషాలోనే ట్రైనింగ్ ఇస్తోంది. అద్భుతమైన సామర్థ్యాలు కలిగిన ఈ సెక్స్ డాల్స్, మగ లేదా ఆడ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి.. ఇవి త్వరలోనే మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్నాయని స్టార్‌పెరీ టెక్నాలజీ సీఈఓ ఇవాన్ లీ వెల్లడించారు.

Read Also: IND vs BAN: నేడు బంగ్లాతో సూపర్‌-8 మ్యాచ్.. సెమీస్‌పై భారత్‌ కన్ను!

కాగా, మేము తర్వాతి తరం సెక్స్ డాల్‌ను అభివృద్ధి చేస్తున్నాము.. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని స్టార్‌పెరీ టెక్నాలజీ సీఈఓ ఇవాన్ లీ వెల్లడించారు. ఈశృంగార బొమ్మలు నేరుగా మానవులతో ఇంటరాక్టివ్ అవుతాయి.. వారికి తిరిగి సమాధానం కూడా చెప్పే విధంగా వీటిలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ జోడిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాగా, కొత్త తరం సెక్స్ డాల్స్, ఏఐ మోడల్స్‌తో ఆధారితం కాబట్టి.. వీటికి సెన్సార్‌లతో అమర్చబడి ఉంటాయన్నారు. ఈ సెక్స్ డాల్స్ లో ప్రాథమిక సంభాషణ సామర్థ్యాలపై కాకుండా భావోద్వేగ కనెక్షన్‌పై దృష్టి సారించడం ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తాయని స్టార్‌పెరీ టెక్నాలజీ సీఈఓ ఇవాన్ లీ పేర్కొన్నారు.