China triple nuclear strike: ప్రపంచ భద్రతకు చైనా ముప్పుకు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల చైనా సైన్యం ప్రయోగశాలలో ఒక ప్రాణాంతక ప్రయోగాన్ని నిర్వహించిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. PLA శాస్త్రవేత్తలు మొదటిసారిగా “ట్రిపుల్-న్యూక్లియర్ స్ట్రైక్” ను ప్రదర్శించారని సమాచారం. దీని అర్థం ఏమిటంటే.. పేలుళ్లు ఒకే వార్‌హెడ్ వల్ల కాకుండా, చిన్న, తక్కువ-శక్తి గల వార్‌హెడ్‌లు ఒకదాని తర్వాత ఒకటి పేలడం, లేదా ఒకేసారి కదిలే క్లస్టర్‌ను ఏర్పరచనున్నాయి. ఇప్పటి వరకు పరిశోధనలు ఒకే వార్‌హెడ్‌లతో మాత్రమే నిర్వహించిన, అభివృద్ధి చేసిన ఈ రకమైన ఆయుధాలను, చైనా చాలా రెట్లు ముందుకు తీసుకెళ్లిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటితో ప్రపంచ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. మూడు చిన్న అణు వార్‌హెడ్‌లు దాదాపు ఒకేసారి పేలడం వల్ల కలిగే విధ్వంసం మామూలుగా ఉండదని అంటున్నారు.
READ ALSO: Karthik Varma : క్రేజీ డైరెక్టర్ ఎంగేజ్ మెంట్.. సెలబ్రిటీల సందడి
బంకర్లే టార్గెట్‌గా..
చైనా ఇటువంటి ఆయుధాన్ని బంకర్లను నాశనం చేయడానికి అభివృద్ధి చేస్తోందని చెబుతున్నప్పటికీ.. ఇది అగ్రరాజ్యం గద్దెను కదిలించే ఆలోచనలు అంటున్నారు. చైనాలోని నాన్జింగ్ ఆర్మీ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించారు. దీని గురించిన సమాచారాన్ని ఎక్స్‌ప్లోషన్ అండ్ షాక్ వేవ్స్ జర్నల్‌లో ప్రచురించారు. పలు నివేదికల ప్రకారం.. చైనా శాస్త్రవేత్తలు ఒకే చోట దాదాపు ఒకేసారి మూడు చిన్న అణు దాడుల ప్రభావాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు. నాన్జింగ్‌లోని పిఎల్‌ఎ విశ్వవిద్యాలయ బృందం ట్రిపుల్-హిట్ ప్రభావాలను మోడల్ చేయడానికి, పరీక్షించడానికి చిన్న స్థాయి, నియంత్రిత ప్రయోగాలను నిర్వహించింది. ఈ బృందం వాక్యూమ్ చాంబర్, రెండు-దశల హై-ప్రెజర్ గ్యాస్ గన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించింది.
మిల్లీ సెకన్లలో విధ్వంసం..
దీనితో మిల్లీసెకన్లలో విధ్వంసం సృష్టించవచ్చని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వార్‌హెడ్ విస్ఫోటనం కేవలం 0.8 మిల్లీసెకన్ల దూరంలో ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. దీని అర్థం.. మూడు పేలుళ్లు ఒక మిల్లీసెకన్ కంటే తక్కువ సమయంలో సంభవిస్తాయి. దీంతో మూడు విస్ఫోటనాలు దాదాపు ఒకేసారి సంభవించి, గతంలో కంటే ఘోరమైన వినాశనాన్ని సృష్టిస్తాయి. ఈ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రయోగం ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ బృందం తాజా పేలుడును 1965 పల్లాంక్విన్ వంటి మునుపటి పరీక్షలతో పోల్చింది. ఈ కొత్త పేలుడు గతంలో కంటే రెండు రెట్లు ఎక్కువ లోతు, వెడల్పు గల బిలంను సృష్టించిందని సమాచారం. సింపుల్‌గా చెప్పాలంటే ఈ ట్రిపుల్-హిట్ లేదా క్లస్టర్డ్ స్ట్రైక్ నేల, రాతిలో తరంగాలను సృష్టిస్తుందని చెబుతున్నారు. ఇది మిశ్రమ ప్రభావాన్ని వ్యక్తిగత పేలుళ్ల కంటే చాలా ఎక్కువగా చేస్తుందని పేర్కొంటున్నారు.
దీంతో ప్రమాదం ఎంత ?
ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల భద్రత డేంజర్‌లో పడినట్లు అయ్యింది. ఎందుకంటే నేడు చాలా దేశాల సైన్యాలు తమ ముఖ్యమైన సైనిక, అణు ఆస్తులను భూగర్భంలో ఉంచుతున్నాయి. సంప్రదాయ బాంబులు లేదా క్షిపణులతో వాటిని నాశనం చేయడం అసాధ్యం. ఇరాన్‌లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసిన సమయంలో ఎంత ప్రయత్నించినా ఆ దేశ బంకర్లను నాశనం చేయడంలో మాత్రం విఫలమైంది. ఆ సమయంలో అమెరికా బంకర్ బస్టర్ బాంబులను మోహరించాల్సి వచ్చింది. ఈ బంకర్ బస్టర్ బాంబులకు బదులుగా తాజాగా చైనా ప్రయోగించిన ఆయుధాన్ని ఉపయోగిస్తే మొత్తం బంకర్ ఒక్క క్షణంలో ధ్వంసమయ్యే అవకాశం ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే దాని పరిమాణం చిన్నది. కాబట్టి చైనా కోరుకునే ప్రదేశాలలో మాత్రమే నష్టం సంభవించేలా దీనిని వినియోగించగలదు. ఈ ఆయుధాన్ని హైపర్‌సోనిక్ లేదా ఇతర హైటెక్ క్షిపణి వ్యవస్థ నుంచి ప్రయోగించవచ్చు. ఇది చాలా శక్తివంతమైనది. దీనితో పెద్ద ప్రమాదం ఏమిటంటే ఇది చాలా తీవ్రమైన రేడియేషన్‌ను విడుదల చేస్తుంది.
తాజా ప్రయోగంతో భారత్‌పై ప్రభావం ఎంత..
చైనా తాజా ప్రయోగంతో భారతదేశంపై ప్రభావం స్పష్టంగా ఉంటుందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతదేశం ఇకపై తన లోతైన బంకర్లు, అణు సౌకర్యాలు, సున్నితమైన అంశాల భద్రతను బలోపేతం చేయాల్సి ఉంటుంది. క్షిపణి రక్షణ, RD-TE (పరిశోధన-అభివృద్ధి), ముందస్తు గుర్తింపు, ప్రతిస్పందన (RAD) లలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. దీనికి చైనా తాజా ప్రయోగం పెద్ద హెచ్చరిక సంకేతంగా పనిచేస్తుంది.
READ ALSO: Jatadhara: అక్టోబర్ 1న ధన పిశాచి వస్తోంది!